logo

అక్రమ మైనింగ్‌పై ఆందోళన

దగదర్తి మండలం తిరువీధిపాడులో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నిలిపివేసిన క్వారీ వద్ద కొందరు గురువారం బ్లాస్టింగ్‌ నిర్వహిస్తుండగా అడ్డుకున్నారు. పేలుళ్ల కారణంగా తమకు ఇబ్బందులు ఎ

Published : 28 Jan 2022 01:17 IST


నిరసన తెలుపుతున్న గ్రామస్థులు

 

దగదర్తి, న్యూస్‌టుడే: దగదర్తి మండలం తిరువీధిపాడులో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నిలిపివేసిన క్వారీ వద్ద కొందరు గురువారం బ్లాస్టింగ్‌ నిర్వహిస్తుండగా అడ్డుకున్నారు. పేలుళ్ల కారణంగా తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మైనింగ్‌ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్థులకు నచ్చజెప్పారు. ఈ సందర్భంగా సర్పంచి సుగుణమ్మ మాట్లాడుతూ గ్రామ కూలీలు గతంలో క్వారీ పనులు చేసుకుంటూ ఉపాధి పొందేవారన్నారు. మైనింగ్‌లో భాగంగా చేపడుతున్న భారీ పేలుళ్లతో రాళ్లు ఎగిరి పొలాలపై పడి వ్యవసాయానికి ఇబ్బందిగా మారిందన్నారు. గ్రామంలోని ఇళ్లు పగుళ్లిచ్చి దెబ్బతినడంతో అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. రెవెన్యూ, మైనింగ్‌ శాఖ అధికారులు విచారించి మైనింగ్‌ పనులు నిలిపివేశారన్నారు. ఇప్పుడు మళ్లీ పనులు నిర్వహించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు మాలకొండయ్య, వెంకటేశ్వర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని