logo

‘అలాంటి అధికారులపై ప్రైవేటు కేసులు వేస్తాం’

తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడే అధికారులపై న్యాయస్థానాల్లో ప్రైవేటు కేసులు వేస్తామని ఆ పార్టీ లీగల్‌ సెల్‌ అడ్వకేట్లు బద్దెపూడి రవీంద్ర, హరినారాయణ అన్నారు. గురువారం వారు పొదలకూరులో విలేకరుల

Published : 28 Jan 2022 01:17 IST


మాట్లాడుతున్న లాయర్‌ బద్దెపూడి రవీంద్ర

 

పొదలకూరు, న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడే అధికారులపై న్యాయస్థానాల్లో ప్రైవేటు కేసులు వేస్తామని ఆ పార్టీ లీగల్‌ సెల్‌ అడ్వకేట్లు బద్దెపూడి రవీంద్ర, హరినారాయణ అన్నారు. గురువారం వారు పొదలకూరులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై వ్యక్తిగత దూషణలు చేసిన వైకాపా నాయకులపై పొదలకూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌ పెట్టారంటూ పొదలకూరు మండల తెదేపా అధ్యక్షుడు మస్తాన్‌బాబుపై ఎసై కరీముల్లా ఐపీసీ 153, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని, సోమిరెడ్డిపై పరుష పదజాలంతో పోస్టింగ్‌ పెట్టిన వైకాపా నాయకులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అభ్యంతరం తెలిపారు. అందుకే ప్రైవేటు కేసు వేస్తున్నామన్నారు. నెల్లూరులోని సోమిరెడ్డి కార్యాలయం ప్రతినిధి సురేంద్రకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపైనా మండిపడ్డారు. అధికారులు రాజ్యాంగానికి లోబడి పని చేయాలని, అతిక్రమించిన వారిలో ఎందరో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు నేడు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారని గుర్తు చేశారు. సోమిరెడ్డి కార్యాలయ ప్రతినిధి హజరత్తయ్య మాట్లాడుతూ గతంలో పొదలకూరులో పనిచేసిన తహసీల్దారు స్వాతి అవినీతి ఆరోపణలపై లోకాయుక్తకు వెళ్లానన్నారు. దాని ద్వారా ప్రశ్నించిన పది ఆరోపణల్లో తొమ్మిది వాస్తవమని కలెక్టర్‌ నిర్ధారించి పంపారని గుర్తు చేశారు. ఆయా సంఘటనల్లో ప్రమేయం ఉన్న ప్రజాప్రతినిధులు ఇప్పుడేం చెబుతారని ప్రశ్నించారు. సమావేశంలో తెదేపా రైతు సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి భాస్కర్‌నాయుడు, రాజశేఖర్‌రెడ్డి, కృష్ణయాదవ్‌, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని