logo

మున్సిపల్‌ కార్మికుల సమ్మె ఫిబ్రవరి 7 నుంచి

మున్సిపల్‌ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి కె.పెంచల నరసయ్య పేర్కొన్నారు. గురువారం నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో విలేకరుల సమావేశం ని

Published : 28 Jan 2022 01:17 IST

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే : మున్సిపల్‌ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి కె.పెంచల నరసయ్య పేర్కొన్నారు. గురువారం నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి ఫిబ్రవరి 7 నుంచి జరిగే సమ్మెలో మున్సిపల్‌ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కరవు భత్యం, మధ్యంతర భృతి ఇవ్వాలని కోరారు. పీఆర్సీ ప్రకారం వేతనాలు అమలు కావడంలేదన్నారు. ఎన్నో పోరాటాలతో సమస్యలు పరిష్కరించుకున్నామని, ఈ సమ్మె ద్వారా మన సమస్యలు పరిష్కరించుకునేందుకు దశల వారీగా ఆందోళనలు చేయనున్నామని తెలిపారు. 28న మున్సిపల్‌ కార్యాలయాల ఎదుట ధర్నా, 29న నల్లబ్యాడ్జీలతో నిరసన, 31న చలో విజయవాడ, ఫిబ్రవరి 5న జిల్లా కేంద్రాల్లో రిలే దీక్షలు, 7 నుంచి సమ్మె జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో సీఐటీయూ కార్యదర్శి గోపాల్‌, నాయకులు సూరి, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని