logo

క్షేత్రంలో డ్రోన్‌ దళం

సమగ్ర భూముల సర్వేకు ప్రభుత్వం డ్రోన్‌ దళాన్ని వినియోగిస్తోంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అహ్మదాబాద్‌కు చెందిన ఓ సంస్థతో ఒప్పందం కుదర్చుకోగా.. ప్రస్తుతం ప్రక్రియ జరుగుతోంది. ముందుగా గ్రామాల్లో బెంచి మార్కులు ఏర్పాటు చేస్తారు. వా

Published : 20 May 2022 01:44 IST

ఆకాశంలోకి డ్రోన్‌ను ఎగరవేస్తున్న సిబ్బంది

చేజర్ల, కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: సమగ్ర భూముల సర్వేకు ప్రభుత్వం డ్రోన్‌ దళాన్ని వినియోగిస్తోంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అహ్మదాబాద్‌కు చెందిన ఓ సంస్థతో ఒప్పందం కుదర్చుకోగా.. ప్రస్తుతం ప్రక్రియ జరుగుతోంది. ముందుగా గ్రామాల్లో బెంచి మార్కులు ఏర్పాటు చేస్తారు. వాటిని సమన్వయం చేస్తూ డ్రోన్‌ దళం రోజుకు ఆరు వేల ఎకరాల భూమిని సర్వే చేస్తుంది. చిన్న విమానాలను పోలి.. ఆరు కిలోల బరువున్న ఈ డ్రోన్‌లు.. రెండు వందల మీటర్ల ఎత్తుకు చేరి.. రెండు గంటలపాటు ఆకాశంలో నిర్విరామంగా ఎగురుతూ భూముల చిత్రాలు సేకరిస్తాయి. ఒక్కోటి.. 1400 ఎకరాల వివరాలను కెమెరాల ద్వారా నిక్షిప్తం చేస్తాయి. గ్రౌండ్‌ కంట్రోల్‌ యూనిట్‌ సభ్యులు వాటిని నియంత్రిస్తూ వివరాలు సేకరిస్తారు. గురువారం చిత్తలూరులో డ్రోన్‌ సర్వే జరుగుతుండగా.. స్థానికులు ఆసక్తిగా తిలకించారు.

పకడ్బందీగా ప్రక్రియ.. వందేళ్ల తర్వాత జరుగుతున్న భూముల రీసర్వే పక్కాగా సాగాలని ఆ శాఖ రీజినల్‌ డైరెక్టర్‌ ఎ.వెంకటేశ్వరరావు ఆదేశించారు. కందుకూరు డివిజన్‌లోని మండల, గ్రామ సర్వేయర్లతో గురువారం ఆయన ఆర్డీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆర్‌ఎస్‌ఆర్‌ ప్రకారం భూముల రకాలు, వాటి సర్వే నంబర్ల వారీగా గుర్తించుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సర్వే చేసేటప్పుడు రికార్డుల్లో ఏముంది. భూముల సాగులో ఎవరున్నారు అన్న వివరాలు పరిశీలించి నమోదు చేయాలన్నారు. ప్రక్రియ ప్రారంభించే ముందు గ్రామంలో అందరికీ తెలపాలని, నిర్దేశిత గడువులోగా రికార్డుల ఆధునికీకరణ జరగాలని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని