logo

అడవుల సంరక్షణ అందరి బాధ్యత

అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఏసీఎఫ్‌ టి.రాజశేఖర్‌ అన్నారు. స్థానిక అటవీశాఖ రేంజి కార్యాలయంలో గురువారం ఆయన సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అడవులు అంతరిస్తే.. పర్యావరణానికి ముప్పు ఏర్పడి

Published : 20 May 2022 01:44 IST

కొత్తపల్లి అటవీశాఖ బీట్‌ను సందర్శించి సిబ్బందికి సూచనలిస్తున్న ఏసీఎఫ్‌ రాజశేఖర్‌బాబు

ఉదయగిరి, న్యూస్‌టుడే: అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఏసీఎఫ్‌ టి.రాజశేఖర్‌ అన్నారు. స్థానిక అటవీశాఖ రేంజి కార్యాలయంలో గురువారం ఆయన సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అడవులు అంతరిస్తే.. పర్యావరణానికి ముప్పు ఏర్పడి.. మానవ మనుగడకే ప్రమాదం తలెత్తే అవకాశం ఏర్పడుతుందన్నారు. అడవులతో పాటు వన్య ప్రాణులను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రేంజి పరిధిలోని కొత్తపల్లి, దేవమ్మచెరువు అటవీశాఖ బీట్‌లను సందర్శించి.. ఆయా ప్రాంతాల్లో జరిగే హద్దుల ఏర్పాటు పనులను పరిశీలించారు. బేస్‌క్యాంప్‌, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ సిబ్బందికి సూచనలిచ్ఛి. అటవీ విస్తీర్ణానికి సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో రేంజ్‌ అధికారి టి.ఉమామహేశ్వరరెడ్డి, డీఆర్వోలు ఖాజారసూల్‌, శ్రీనివాసులు, ఎఫ్‌ఎస్‌వో ప్రసాద్‌, ఎఫ్‌బీవోలు నాయబ్‌, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని