logo

ముగిసిన ఇంటర్మీడియట్‌ పరీక్షలు

జిల్లాలో 91 కేంద్రాల్లో నిర్వహించిన ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు కెమిస్ట్రీ, కామర్స్‌ పరీక్షలు ప్రశాంతంగా సాగాయి. జిల్లా వ్యాప్తంగా 27,471 మంది హాజరు కావాల్సి ఉండగా 26,177 మంది

Published : 20 May 2022 01:44 IST

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: జిల్లాలో 91 కేంద్రాల్లో నిర్వహించిన ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు కెమిస్ట్రీ, కామర్స్‌ పరీక్షలు ప్రశాంతంగా సాగాయి. జిల్లా వ్యాప్తంగా 27,471 మంది హాజరు కావాల్సి ఉండగా 26,177 మంది హాజరవగా 1294 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలను ఆర్‌ఐవో 5 కేంద్రాలను, పరిశీలకులు 4, డీఈసీ సభ్యులు 6, స్క్వాడ్‌లు 39, ఇతర అధికారులు 27 కేంద్రాల్లో పరిశీలించారు. ఎలాంటి మాల్‌ ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదని ఆర్‌ఐవో టి.వరప్రసాద్‌రావు పేర్కొన్నారు. ఇటీవల అకాల వర్షాలకు వాయిదా పడిన ప్రథమ సంవత్సరం పరీక్ష ఈ నెల 25న నిర్వహించనున్నారు. ప్రధాన పరీక్షలు ముగియడంతో బయటకు వచ్చిన విద్యార్థులు ఆనందోత్సాహంతో పేపర్లను చించి గాల్లోకి ఎగురవేసి కేరింతలు కొట్టారు. వసతి గృహాల్లో ఉండిన విద్యార్థులు ఇళ్లకు పయనమయ్యారు. దీంతో నగరంలోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్‌ విద్యార్థులతో కిటకిటలాడాయి.

 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని