logo

‘ఇసుక కొరతతో ఇళ్లు కట్టుకోలేకపోతున్నాం సార్‌’

జగనన్న ఇళ్లకు ప్రభుత్వం 20 టన్నుల ఇసుక ఇస్తోందని, అది సరిపోక ఇళ్లు కట్టుకోలేకపోతున్నామని జేసీ హరేంధిరప్రసాద్‌కు లబ్ధ్దిదారులు తెలిపారు. అదనంగా 10 టన్నుల ఇసుక ఇప్పించాలని కోరారు. పట్టణంలోని వరాలసాయినగర్‌ లేఅవుట్‌ను

Published : 20 May 2022 01:44 IST


వరాలసాయినగర్‌ లేఅవుట్‌ను పరిశీలిస్తున్న జేసీ హరేంధిరప్రసాద్‌, ఆర్డీవో ఉమాదేవి

 

కందుకూరు పట్టణం, గుడ్లూరు, న్యూస్‌టుడే: జగనన్న ఇళ్లకు ప్రభుత్వం 20 టన్నుల ఇసుక ఇస్తోందని, అది సరిపోక ఇళ్లు కట్టుకోలేకపోతున్నామని జేసీ హరేంధిరప్రసాద్‌కు లబ్ధ్దిదారులు తెలిపారు. అదనంగా 10 టన్నుల ఇసుక ఇప్పించాలని కోరారు. పట్టణంలోని వరాలసాయినగర్‌ లేఅవుట్‌ను గురువారం జేసీ, అధికారులు పరిశీలించారు. జేసీ మాట్లాడుతూ జేపీ వెంచర్స్‌తో మాట్లాడి ఇసుక అదనంగా ఇప్పిస్తామన్నారు. దూబగుంట సమీపంలో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. ఆర్డీవో పి.ఉమాదేవి, తహసీల్దారు సీతారామయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.మనోహర్‌, గృహనిర్మాణశాఖ డీఈ అహ్మద్‌బాషా, ప్రజారోగ్యశాఖ ఈఈ మదర్‌సాఅలీ పాల్గొన్నారు. అసని తుపాన్‌ ప్రభావంతో నష్టపోయిన వరి, పత్తి రైతులను ఆదుకుంటామని జిల్లా సంయుక్త కలెక్టరు హరేంధిర ప్రసాద్‌ అన్నారు. మాచవరం, గుండ్లపాలెంలో వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంటను పరిశీలించారు. మండలంలో సుమారు మూడు వేల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వచ్చిందని ప్రాధమికంగా అంచనా వేశామని వ్యవసాయాధికారిణి గీతా ప్రకాష్‌ వివరించారు. గుండ్లపాలెం- రాళ్లపాడు మధ్య పొలాల్లో పత్తి రైతులతో జేసీ ముచ్చటించారు. తహసీల్దారు లావణ్య, ఏడీఏ శేషగిరిరావు, జడ్పీటీసీ సభ్యుడు బాపిరెడ్డి, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని