logo

పదుగురు మెచ్చేట్టు

వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. కొందరు నిర్మాణాలకు అడ్డుగా వస్తున్నాయని చెట్లను కొట్టివేస్తుండగా- మరికొందరు మాత్రం ఎంతో అపురూపంగా వాటిని సంరక్షిస్తున్నారు. చేవూరు ఎస్సీ కాలనీకి చెందిన తమ్మిశెట్టి ప్రసాద్‌ ఇంటి నిర్మాణం చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా ముచ్చటగా

Published : 22 May 2022 03:32 IST

వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. కొందరు నిర్మాణాలకు అడ్డుగా వస్తున్నాయని చెట్లను కొట్టివేస్తుండగా- మరికొందరు మాత్రం ఎంతో అపురూపంగా వాటిని సంరక్షిస్తున్నారు. చేవూరు ఎస్సీ కాలనీకి చెందిన తమ్మిశెట్టి ప్రసాద్‌ ఇంటి నిర్మాణం చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా ముచ్చటగా పెంచుకున్న మామిడి చెట్టు.. పైకప్పునకు అడ్డొచ్చింది. అయినా.. దాన్ని కొట్టేయకుండా.. ఇంటి గోడను పక్కకు జరిపి.. పైకప్పునకు రంధ్రం వేసి.. చెట్టు పై భాగాన్ని మేడ మీదకు వచ్చేలా నిర్మించారు. మిద్దె పైభాగంలో కొమ్మలు గుబురుగా పెరిగి నీడనిస్తుంటే.. అక్కడ సేదతీరుతున్నారు. ఇప్పుడు కాయలు సైతం వస్తుండటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.- న్యూస్‌టుడే, గుడ్లూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని