logo

రైళ్ల పరుగుకు అంతరాయం

వేదాయపాళెం రైల్వేస్టేషన్‌ సమీపంలో శనివారం సిగ్నలింగ్‌ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తి రైళ్ల పరుగుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజరు అరుణ్‌కుమార్‌ జైన్‌ ప్రత్యేక రైలులో ఈ ప్రాంతంలో పర్యటించనుండటంతో అధికారులు ఆగమేఘాలపై పరిస్థితిని చక్కదిద్దారు. అప్పటికే వివి

Published : 22 May 2022 03:32 IST


రికార్డులు పరిశీలిస్తున్న దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌

 

బిట్రగుంట, నెల్లూరు (రైల్వే స్టేషన్‌), న్యూస్‌టుడే: వేదాయపాళెం రైల్వేస్టేషన్‌ సమీపంలో శనివారం సిగ్నలింగ్‌ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తి రైళ్ల పరుగుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజరు అరుణ్‌కుమార్‌ జైన్‌ ప్రత్యేక రైలులో ఈ ప్రాంతంలో పర్యటించనుండటంతో అధికారులు ఆగమేఘాలపై పరిస్థితిని చక్కదిద్దారు. అప్పటికే వివిధ రైల్వేస్టేషన్లలో ఎగువ, దిగువ మార్గాల్లో వెళ్లే ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ ఫాస్ట్‌, మెము రైళ్లు నిలిచిపోయాయి. విజయవాడ రైల్వే మెము, రాజధాని, పూరి, కొల్లాం తదితరాలు ఒక్కొక్కటి అరగంట పైనే ఆలస్యంగా నడిచాయి. సిగ్నల్స్‌ పనిచేయకపోవడంతో స్టేషన్‌ అధికారుల లిఖితపూర్వక ఉత్తర్వులు అందుకుని నడిపారు.

జీఎం తనిఖీలు... దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ శనివారం కృష్ణపట్నం నుంచి విజయవాడ వరకు ప్రధాన రైల్వే స్టేషన్లను తనిఖీ చేశారు. కృష్ణపట్నంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం.. నెల్లూరు రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేశారు. చేపట్టనున్న అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. త్వరలో రూ. 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అన్ని చర్యలు పూర్తయ్యాయన్నారు. వాటి కారణంగా ప్రయాణికులకు ఎలాంఇట అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. పడుగుపాడు గూడ్స్‌ షెడ్‌ను సందర్శించిన అనంతరం.. బిట్రగుంటకు చేరుకున్నారు. డ్రైవర్లు, గార్డులు, క్రూకంట్రోల్‌ కార్యాలయంలో రికార్డులు పరిశీలించి.. విధులపై ఆరా తీశారు. మూడో లైన్‌ పనితీరును గమనించారు. శ్రీవెంకటేశ్వరపాళెం, ఒంగోలు, బాపట్ల రైల్వేస్టేషన్లను తనిఖీ చేశారు. మూడోలైను పనులు, ట్రాక్‌ పటిష్ఠతను తన ప్రత్యేక రైలు నుంచే గమనించారు. ఆయన వెంట విజయవాడ రైల్వే డివిజనల్‌ మేనేజరు సీవేంద్ర మోహన్‌, వివిధ విభాగాల జోనల్‌, డివిజన్‌ అధికారులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని