logo

ప్రియుడే కాలయముడు

ప్రియుడే కాలయముడయ్యాడు.. ఈ నెల 21న వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి కేసులో నిందితుడిని బుధవారం నవాబుపేట పోలీసులు అరెస్టు చేశారు. రెండో పట్టణ పోలీసుస్టేషన్‌ సీఐ సుబ్బారావు తెలిపిన వివరాల మేరకు.. బాలాజీనగర్‌ చీపురకట్ట

Published : 26 May 2022 03:22 IST

వివాహిత హత్య కేసులో నిందితుడి అరెస్టు

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: ప్రియుడే కాలయముడయ్యాడు.. ఈ నెల 21న వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి కేసులో నిందితుడిని బుధవారం నవాబుపేట పోలీసులు అరెస్టు చేశారు. రెండో పట్టణ పోలీసుస్టేషన్‌ సీఐ సుబ్బారావు తెలిపిన వివరాల మేరకు.. బాలాజీనగర్‌ చీపురకట్ట సంఘానికి చెందిన పి.సంపూర్ణ(28)కు టీ మాస్టర్‌గా పనిచేస్తున్న వేణును ప్రేమించి వివాహం చేసుకుంది.. నవాబుపేటలోని రామచంద్రాపురంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. పొదలకూరు రోడ్డులోని పెట్రోలు బంకులో సంపూర్ణ పనిచేస్తోంది. మనస్పర్థల నేపథ్యంలో సంపూర్ణ, వేణు మూడేళ్ల క్రితం విడిపోయారు. అప్పటి నుంచి ఆమె వేరుగా ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది.. వైఎస్సార్‌ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ జనార్దన్‌తో ఆమెకు పరిచయం ఏర్పడటంతో వారిద్దరు సన్నిహితంగా ఉంటున్నారు. 21న ఉదయం సంపూర్ణను కుటుంబ సభ్యులు ఎంత లేపినా స్పందించకపోవడంతో పోలీసులకు సమాచారమివ్వగా. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం హత్యగా కేసు బదలాయించి దర్యాప్తు  చేయగా ఆటో డ్రైవరు జనార్ధన్‌ హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. 20వ తేదీ రాత్రి సంపూర్ణ ఇంట్లో నిద్రపోతుండగా జనార్ధన్‌ చున్నీతో గొంతు నులిమి హత్య చేశాడు. తన మాట వినడం లేదని, వేరొకరితో చనువుగా ఉంటుందనే అనుమానంతో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. జనార్ధన్‌కు వివాహమై, పిల్లలున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని