logo

గ్రామ పంచాయతీలకు ప్రత్యేక ఖాతాలు : డీపీవో

15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీల ద్వారా వ్యయం అయ్యేలా ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలను సిద్ధం చేశామని జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి తెలిపారు. బుధవారం సంగంలో పంచాయతీ,

Published : 26 May 2022 03:23 IST

సంగం, న్యూస్‌టుడే: 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీల ద్వారా వ్యయం అయ్యేలా ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలను సిద్ధం చేశామని జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి తెలిపారు. బుధవారం సంగంలో పంచాయతీ, గ్రామ సచివాలయ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. పీఎఫ్‌ఎంఎస్‌ విధానం ద్వారా గ్రామ సర్పంచి, కార్యదర్శుల సంయుక్త ఖాతాలో నిధులు జమ అవుతాయన్నారు. వారిద్దరి ఆమోదంతోనే చెల్లింపులు జరుగుతాయన్నారు.ప్రస్తుతం జిల్లాలో 37 మండలాల పరిధిలో 722 గ్రామ పంచాయతీలున్నాయన్నారు. జూన్‌  20వతేదీకి అన్ని పంచాయతీల పరిధిలో చెత్త సంపద కేంద్రాలు పూర్తి కావాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా మార్చేందుకు జేఎస్‌ఎస్‌ పేరుతో ప్రత్యేక యాప్‌  అందుబాటులో ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా   70 సచివాలయాల్లో ఆధార్‌ సేవలు  ప్రారంభించామని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని