logo

సజావుగా ఉప ఎన్నికల ప్రక్రియ: కలెక్టర్‌

ఆత్మకూరు అసెంబ్లీ నియోజక వర్గ ఎన్నికలను సజావుగా నిర్వహించేలా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌ బాబు పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ఎన్నికల నిర్వహణపై శనివారం సమీక్ష నిర్వహించారు.

Published : 29 May 2022 01:39 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు, చిత్రంలో జేసీ, ఏఎస్పీ

నెల్లూరు (సంక్షేమం), న్యూస్‌టుడే: ఆత్మకూరు అసెంబ్లీ నియోజక వర్గ ఎన్నికలను సజావుగా నిర్వహించేలా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌ బాబు పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ఎన్నికల నిర్వహణపై శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలపై అధికారులకు అవగాహన ఉండాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఓటర్లకు అవగాహన, డిస్ట్రిబ్యూషన్‌, స్ట్రాంగ్‌ రూములు, కౌంటింగ్‌, ఈవీఏం నిర్వహణలపై ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగు కేంద్రాల మ్యాపింగ్‌ ప్రక్రియ, వెబ్‌ క్యాస్టింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఓటర్ల స్లిప్పుల పంపిణీ కూడా పటిష్ఠంగా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జేసీ హరింధిర ప్రసాద్‌, అడిషనల్‌ ఎస్పీ చౌడేశ్వరీ, డీఆర్వో వెంకట నారాయణమ్మ, డీఎఫ్‌వో షణ్ముక కుమార్‌, ఆత్మకూరు ఆర్డీవో బాపిరెడ్డి, జడ్పీ సీఈవో వాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని