logo

పీహెచ్‌సీలలో కాన్పుల సంఖ్య పెంచాలి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాన్పుల సంఖ్యను పెంచడంపై వైద్యాధికారులు దృష్టి సారించాలని డీఎంహెచ్‌వో పెంచలయ్య ఆదేశించారు. నగరంలోని వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం వైద్యాధికారులతో డీఎంహెచ్‌వో సమీక్షించారు.

Published : 29 May 2022 01:39 IST

సమీక్షిస్తున్న డీఎంహెచ్‌వో పెంచలయ్య

నెల్లూరు(వైద్యం), న్యూస్‌టుడే : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాన్పుల సంఖ్యను పెంచడంపై వైద్యాధికారులు దృష్టి సారించాలని డీఎంహెచ్‌వో పెంచలయ్య ఆదేశించారు. నగరంలోని వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం వైద్యాధికారులతో డీఎంహెచ్‌వో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. సకాలంలో విధులకు హాజరవ్వాలన్నారు. విష జ్వరాలు ప్రబలకుండా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వైద్యులకు అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో డీటీసీవో వెంకట ప్రసాద్‌, డివిజన్‌ ప్రోగ్రాం అధికారులు భగీరధి, ప్రియంవద, దయాకర్‌, సుధీర్‌, డెమో శ్రీనివాసురావు, డీఎంవో హుస్సేనమ్మ, డీపీహెచ్‌ఎన్‌వో భూలోకమ్మ, ఎస్‌వో సహన, డాక్టర్‌ అమరేంద్రనాథ్‌రెడ్డి, డిప్యూటీ డెమో శ్రీనివాసులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని