Kotamreddy: బాలినేని ఆవేదన ఎంతో బాధ కలిగించింది: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తరహాలోనే తనకూ ఇంటి పోరు తప్పట్లేదని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వాపోయారు.

Published : 29 Jun 2022 02:32 IST

నెల్లూరు: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తరహాలోనే తనకూ ఇంటి పోరు తప్పట్లేదని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వాపోయారు. జిల్లాకు చెందిన వైకాపా ముఖ్యనేతలు వారి నియోజకవర్గాల్లో కాకుండా తన నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆక్షేపించారు. ‘‘బాలినేని మూడు జిల్లాలకు ఇన్‌ఛార్జి. పార్టీలో కీలక నేత. అంతటి వ్యక్తికి స్థానిక నాయకులు అండగా ఉండాలిగానీ సమస్యగా మారకూడదు. ఆయన ఆవేదన చాలా బాధ కలిగించింది. బాలినేని ఆత్మస్థైర్యం దెబ్బతినేలా పార్టీ నేతలు ఎవరూ ప్రవర్తించకూడదు. నెల్లూరులో నేనూ అలాంటి సమస్యే ఎదుర్కొంటున్నాను. కొంత మంది పార్టీ ముఖ్యనేతలు వారి నియోజకవర్గాల్లో మరోసారి ఎలా గెలవాలో ఆలోచించకుండా ఇతర నియోజకవర్గాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఇది పార్టీకి మంచిది కాదు’’ అని శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని