logo

కథ.. దర్శకత్వం.. ఓ మహిళ

నెల్లూరు నగరంలో సంచలనం సృష్టించిన వైద్యుడి ఇంట్లో దొంగతనం కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. చోరీకి కథ.. దర్శకత్వం మొత్తం ఓ మహిళగా గుర్తించారు. దీంతో పాటు మరో రెండు నేరాలు కూడా చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా..

Updated : 30 Sep 2022 13:17 IST

వైద్యుడి ఇంట్లో చోరీ కేసులో కీలక ఆధారాలు

పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: నెల్లూరు నగరంలో సంచలనం సృష్టించిన వైద్యుడి ఇంట్లో దొంగతనం కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. చోరీకి కథ.. దర్శకత్వం మొత్తం ఓ మహిళగా గుర్తించారు. దీంతో పాటు మరో రెండు నేరాలు కూడా చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఈ నెల 11న పొగతోటలోని ఓ వైద్యుడి ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి సుమారు రూ. 60 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఎస్పీ విజయరావు పర్యవేక్షణలో సీసీఎస్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలు వివిధ కోణాల్లో విచారించి.. ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మరికొన్ని ఆధారాలు సేకరించారు. పాత నేరస్థులే ఈ చోరీకి పాల్పడినట్లు తేల్చారు. ఆ క్రమంలోనే నిందితులను అదుపులోకి తీసుకుని.. వారి నుంచి బంగారం కూడా రికవరీ చేసినట్లు తెలిసింది. తీగ లాగితే డొంక కదిలినట్లు.. నిందితులను విచారిస్తున్న సమయంలో జిల్లాలో జరిగిన మరో రెండు నేరాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం వాటి గురించి ఆరా తీస్తున్నారు. వైద్యుడి ఇంట్లో జరిగిన చోరీ కేసులో మరో ఇద్దరు ప్రధాన నిందితులను పట్టుకోవాల్సి ఉండగా.. ఈ చోరీ కేసుకు కథ, దర్శకత్వం నడిపింది ఓ మహిళగా గుర్తించారు. మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని