logo

అంకితభావంతోనే మన్నన : కలెక్టర్‌

సచివాలయ సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు సూచించారు.

Published : 02 Oct 2022 02:03 IST

జమ్మలపాలెంలో అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

జలదంకి, న్యూస్‌టుడే: సచివాలయ సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు సూచించారు. మండలంలోని చామదలలో శనివారం రూ.79.30 లక్షలతో నూతనంగా నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాలను ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డితో కలసి కలెక్టర్‌ ప్రారంభించారు. ఉన్నత పాఠశాలలో నాడు-నేడు విడతలో భాగంగా నూతనంగా రూ.1.41 కోట్లతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. వైకాపా మండల కన్వీనర్‌ జనార్దన్‌రెడ్డి, సర్పంచి సీతారామమ్మ, జడ్పీటీసీ సభ్యురాలు శివలీల, ఎంపీటీసీలు అమరావతి, విజయరెడ్డి, పీఆర్‌ ఏఈ తిరుమలయ్య పాల్గొన్నారు.

జమ్మలపాలెం(జలదంకి): మధ్య తరగతి ఆదాయవర్గాల వారికి సొంతింటి కలను నెరవేర్చేందుకే ప్రభుత్వం జగనన్న స్మార్ట్‌ టౌన్‌ నిర్మిస్తోందని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు సూచించారు. జలదంకి మండలంలోని జమ్మలపాలెంలో నుడా ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న జగనన్న స్మార్ట్‌ టౌన్‌ పనులను ఆయన పరిశీలించారు. నుడా వైస్‌ చైర్మన్‌ ఓబులేష్‌ నందన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని