logo

ఖరీఫ్‌ సీజన్‌లో ముందస్తు చర్యలు

జిల్లాలో రబీ సీజనులో రైతుల నుంచి ధాన్యం సేకరణలో ఎదుర్కొన్న సమస్యలు పునరావృతం కాకుండా ఖరీఫ్‌ సీజన్‌లో పటిష్ఠంగా ముందస్తు చర్యలు చేపట్టాలని

Published : 02 Oct 2022 02:03 IST

మాట్లాడుతున్న పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే : జిల్లాలో రబీ సీజనులో రైతుల నుంచి ధాన్యం సేకరణలో ఎదుర్కొన్న సమస్యలు పునరావృతం కాకుండా ఖరీఫ్‌ సీజన్‌లో పటిష్ఠంగా ముందస్తు చర్యలు చేపట్టాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో 2022-23 ఖరీఫ్‌ సీజనులో ధాన్యం సేకరణపై రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వైస్‌ఛైర్మన్‌, ఎండీ జి.వీరపాండ్యన్‌తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక చర్యలు తీసుకుంటున్నారని, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సక్రమంగా అమలు జరిగితేనే రైతులకు లాభం చేకూరుతుందన్నారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వైస్‌ ఛైర్మన్‌, ఎండీ వీరపాండ్యన్‌ మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజనులో ధాన్యం సేకణలో నూతన పద్ధతులు అవలంభించేందుకు విధివిధానాలు రూపకల్పన చేశామన్నారు. ధాన్యం నాణ్యత పరిశీలన, తూకం వేసి రైతులకు సంబంధించి కాపీని కూడా అందజేస్తామన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌, పౌరసరఫరాల సంస్థ డీఎం పద్మ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి సుధాకర్‌రాజు, నెల్లూరు, ఆత్మకూరు ఆర్డీవోలు మలోల, కరుణకుమారి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని