logo

వైకాపాలో భగ్గుమన్న విభేదాలు

మండల సర్వసభ్య సమావేశం శనివారం జరగాల్సి ఉండగా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుల మధ్య వర్గపోరుతో  వాయిదా పడింది.

Updated : 27 Nov 2022 02:25 IST

ఎమ్మెల్యే మేకపాటి హాజరు
ఉద్రిక్తతల మధ్య సమావేశం వాయిదా

నాయకులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, పక్కన ఎంపీపీ మోహన్‌రెడ్డి

వింజమూరు, న్యూస్‌టుడే: మండల సర్వసభ్య సమావేశం శనివారం జరగాల్సి ఉండగా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుల మధ్య వర్గపోరుతో  వాయిదా పడింది. ఎంపీపీ మోహన్‌రెడ్డి, కాటేపల్లి ఎంపీటీసీ సభ్యులు పురుషోత్తం దస్త్రాల్లో సంతకాలు చేయగా మిగిలిన పది మంది ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యులు గణపం బాలకృష్ణారెడ్డి సమావేశ మందిరానికి వచ్చి కూర్చొని సంతకాలు చేయలేదు. ఇన్‌ఛార్జి ఎంపీడీవో ప్రసన్నకుమారి సంతకాలు చేయాలని కోరగా చేయలేదు. ఎంపీటీసీ సభ్యులు మాట్లాడుతూ ఎజెండాలో జులై 31న, ఆగస్టు 29న జరగాల్సిన సమావేశాలకు  హాజరుకాలేదని మూడోసారి జరిగే సమావేశానికి రాకుంటే సభ్యత్వాలు రద్దవుతాయని పేర్కొనడం బాధించిందన్నారు.  ఎంపీడీవోను సస్పెండ్‌ చేయాలి, ఎంపీపీ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఎంపీపీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీటీసీ సభ్యులు రిజిస్టరులో సంతకాలు చేస్తే తాను సభకు వస్తానని ఎంపీడీవోకు చెప్పారు. సభ్యులెవరూ సంతకాలు చేయకపోవడంతో కోరం లేక సభను వాయిదా వేస్తున్నట్లు ఇన్‌ఛార్జి ఎంపీడీవో పి.ప్రసన్నకుమారి ప్రకటించారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి అక్కడికి చేరుకొని ఎంపీపీ  గదిలో కూర్చొన్నారు. కాసేపటికి అక్కడి నుంచి వెనుదిరిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని