తీరం.. యమ ఘోరం!
తీరప్రాంతాల సంరక్షణకు, ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషించేవి వనాలు, మడ అడవులు. ఇవి ప్రస్తుతం విధ్వంసమవుతున్నాయి.
న్యూస్‌టుడే, విడవలూరు
తీరంలో నరికివేసిన చెట్లు
తీరప్రాంతాల సంరక్షణకు, ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషించేవి వనాలు, మడ అడవులు. ఇవి ప్రస్తుతం విధ్వంసమవుతున్నాయి. కర్బన ఉద్గారాలను పెద్ద మొత్తంలో గ్రహించి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు ఇవి ఎంతో తోడ్పడతాయి. యథేచ్ఛగా చెట్లు నరికేయడంతో ఆ ప్రాంతం బోసిపోతుండగా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కావలి నుంచి తడ వరకు 169 కి.మీ. తీరం ఉండగా, తీర ప్రాంతాల్లో 118 పైగా గ్రామాలున్నాయి. మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోగా విపత్తుల సమయంలో తీరంలోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఉమ్మడి జిల్లాలో పరిస్థితి..
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కావలి, బోగోలు, అల్లూరు, విడవలూరు, ఇందుకూరుపేట, టీపీగూడూరు, ముత్తుకూరు, చిల్లకూరు, వాకాడు, కోట, సూళ్లూరుపేట, తడ మండలాల్లో మత్స్యకార గ్రామాలున్నాయి. 2015లో అప్పటి ప్రభుత్వం గ్రీన్‌వాల్ ప్రాజెక్ట్ పేరుతో 18 లక్షలకు పైగా తాటి మొక్కలు నాటారు. తీరం వెంబడి పెరిగిన సరుగుడు చెట్లను పెంచారు. ఇంత వరకు బాగానే ఉన్నా వాటి సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
నిర్లక్ష్యం
అధికారుల నిర్లక్ష్యంతో.. కొందరు చెట్లను ఇష్టారీతిన నరికేసి అమ్ముకుంటున్నారు. మరికొందరు తీరాన్ని ఆక్రమించి రొయ్యల సాగు చేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ఆక్రమణదారులు పేట్రేగిపోతున్నారు.
తెగబడుతున్న అక్రమార్కులు
ఇదే అదునుగా కొందరు తీరప్రాంత పరిరక్షణలో కీలకపాత్ర పోషించే మడ అడవుల విధ్వంసానికి తెగబడుతున్నారు. దీంతో తీరానికి వస్తున్న పర్యాటకులకు నీడ కరవు అవుతోంది. తాగునీరు ఉప్పుగా మారుతోందని తీరప్రాంత వాసులు వాపోతున్నారు. అంతరించిపోతున్న వృక్ష సంపదను కాపాడాలని వారు కోరుతున్నారు.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
చంద్రశేఖర్, తహసీల్దారు
తీర ప్రాంతాన్ని పరిశీలిస్తాం. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అటవీశాఖ, మెరైన్ శాఖల వారికి తెలియజేస్తాం. తగిన చర్యలు తీసుకుంటాం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27/01/2023)
-
World News
Handsome Man: శాస్త్రీయంగా ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరంటే?
-
India News
Arvind Kejriwal: చర్చలకు పిలిచిన సక్సేనా.. నో చెప్పిన కేజ్రీవాల్
-
Technology News
Cola Phone: కోకాకోలా కొత్త స్మార్ట్‌ఫోన్.. విడుదల ఎప్పుడంటే?
-
Movies News
Haripriya: ఒక్కటైన ‘కేజీయఫ్’ నటుడు, ‘పిల్ల జమీందార్’ నటి
-
World News
Pakistan: పాక్ సంక్షోభం.. కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి