logo

వ్యవసాయ కళాశాలలో డిసెంబరు నుంచి తరగతులు

ఉదయగిరిలోని మేకపాటి గౌతమ్‌రెడ్డి వ్యవసాయ కళాశాలలో డిసెంబరు 8 నుంచి బీఎస్సీ(హానర్స్‌) తరగతులు ప్రారంభిస్తున్నట్లు ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్‌ డాక్టర్‌ ఎ.ప్రతాప్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

Published : 29 Nov 2022 01:47 IST

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం డీన్‌

వసతులు పరిశీలిస్తున్న డీఎన్‌ ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ కరుణాసాగర్‌

ఉదయగిరి, న్యూస్‌టుడే: ఉదయగిరిలోని మేకపాటి గౌతమ్‌రెడ్డి వ్యవసాయ కళాశాలలో డిసెంబరు 8 నుంచి బీఎస్సీ(హానర్స్‌) తరగతులు ప్రారంభిస్తున్నట్లు ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్‌ డాక్టర్‌ ఎ.ప్రతాప్‌కుమార్‌రెడ్డి తెలిపారు. స్థానిక ‘మెరిట్స్‌’లో వ్యవసాయ కళాశాల నిర్వహణకు అవసరమైన వసతులు, ఏర్పాట్లను సోమవారం ప్రిన్సిపల్‌ కరుణాసాగర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రవేశాల నమోదు వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచామని.. వెబ్‌ ఆప్షన్ల అనంతరం వచ్చే నెల 7, 8, 9 తేదీల్లో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తామన్నారు. ఈ కళాశాలలో సుమారు 200 మంది విద్యార్థులు చేరే అవకాశం ఉందన్నారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసి.. ఎక్కువ మందికి ప్రవేశాలు కల్పిస్తామన్నారు.
ప్రిన్సిపల్‌గా బాధ్యతల స్వీకరణ.. మేకపాటి గౌతమ్‌రెడ్డి వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్‌గా డాక్టర్‌ జి.కరుణాసాగర్‌ సోమవారం బాధ్యతలు చేపట్టారు. తిరుపతి శ్రీవెంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో సేద్య విభాగాధిపతిగా పనిచేస్తూ.. ఉద్యోగోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ప్రవేశాలు పొందే విద్యార్థులకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించి.. ఎలాంటి ఇబ్బంది లేకుండా  చేస్తామన్నారు. కార్యక్రమంలో మెరిట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టరు మనోజ్‌కుమార్‌రెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని