logo

ప్రకృతి సేద్యం లాభాలు ఘనం

అతనిది మధ్యతరగతి కుటుంబం. ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్నారు. బ్యాంకులో ఒప్పంద ఉద్యోగిగా చేరారు. విశాఖపట్నంలో సుభాష్‌ పాలేకర్‌ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.

Published : 29 Nov 2022 01:47 IST

కావలి గ్రామీణం, న్యూస్‌టుడే

పాలు తీస్తున్న మాధవరావు

తనిది మధ్యతరగతి కుటుంబం. ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్నారు. బ్యాంకులో ఒప్పంద ఉద్యోగిగా చేరారు. విశాఖపట్నంలో సుభాష్‌ పాలేకర్‌ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాటలకు ఆకర్షితులై ప్రకృతి వ్యవసాయం ప్రారంభించారు. ప్రణాళికాబద్ధంగా చేయడంతో లాభాల బాట పట్టారు మండలంలోని కొత్తపల్లికి చెందిన ఎర్ర మాధవరావు. 2015లో ఆరు ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించారు. ఇందుకు కషాయాలు, జీవామృతాలు తయారుచేసేందుకు రెండు ఆవులు పెంచుతున్నారు. ఆవు మూత్రం, పేడ ద్వారా  కషాయాలు తయారు చేసి పంటలకు వాడుతున్నారు. రెండేళ్లపాటు ఆశించిన స్థాయిలో దిగుబడి రాక నష్టాలు వచ్చాయి. అయినా  ఆరోగ్యకర ఉత్పత్తులు పండించాలని అధికారుల సూచనలతో సాగు చేశారు. ఫలితం దక్కింది. అధిక దిగుబడులు రావడంతో లాభాలు దక్కాయి.

ఆదాయం ఇలా..

దుక్కి, కూలీలు, కషాయాల తయారీ, విత్తనాలు తదితర వాటికి ఎకరానికి రూ.20 వేలు ఖర్చు అయింది. 30 బస్తాలు దిగుబడి వచ్చింది. 50 కేజీల బస్తా రూ.4 వేలు చొప్పున విక్రయించారు. దీంతో ఖర్చులు పోను ఎకరానికి లక్ష రూపాయలు ఆదాయం వచ్చింది. పదెకరాలపై సుమారు    రూ.10 లక్షలు మిగులుతుంది.

పాడి, పంట.. రెండు కళ్లుగా..

వ్యవసాయానికి అనుబంధంగా 20 ఆవులు, 20 గేదెలను పోషిస్తున్నారు. వీటిపై మరికొంత ఆదాయం పొందుతున్నారు. ఆవు మూత్రం, పేడతో వివిధ రకాల కషాయాలు తయారుచేసి పంటలకు వినియోగిస్తున్నారు.  వీటిని  రైతులకు విక్రయిస్తున్నారు. 20 ఆవులు     ఉన్నాయి. ఒక్కో ఆవు రోజుకు 6 నుంచి 8 లీటర్ల పాలు ఇస్తుంది. రోజుకు 50 లీటర్లు సేకరిస్తున్నారు. పాలపై రోజుకు రూ. 5 వేలు వస్తున్నాయి. 20 గేదెల పాలపై  మరో రూ.3 వేలు వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని