logo

డ్రాగన్‌.. సిరులు కురిపించెన్‌

మెట్ట ప్రాంతంలో డ్రాగన్‌ తోట సాగు చేసి సిరులు పండిస్తున్నారు పొదలకూరుకు చెందిన దుగ్గినేని వెంకటేశ్వర్లు, రత్నకుమారి దంపతులు. మండలంలోని కనుపర్తి సమీపంలోని సొంత పొలంలో దీన్ని పెంచుతున్నారు.

Published : 29 Nov 2022 01:47 IST

న్యూస్‌టుడే, పొదలకూరు

మెట్ట ప్రాంతంలో డ్రాగన్‌ తోట సాగు చేసి సిరులు పండిస్తున్నారు పొదలకూరుకు చెందిన దుగ్గినేని వెంకటేశ్వర్లు, రత్నకుమారి దంపతులు. మండలంలోని కనుపర్తి సమీపంలోని సొంత పొలంలో దీన్ని పెంచుతున్నారు. ఎకరానికి మొక్కల కొనుగోలు, నాటడం, సిమెంటు దిమ్మెలు, వాటిపై కాంక్రీట్‌ చక్రం, డ్రిప్‌ తదితర వాటికి సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చు చేశారు.  అందరిమాదిరిగా పెంచడం లేదు. పశువుల ఎరువు, వేప సంబంధ కషాయాలు వాడుతున్నారు. దీంతో  ఈ పండ్లు నాణ్యతగా ఉంటున్నాయి. తొలి ఏడాది ఎకరానికి 700 కిలోల వరకు దిగుబడి వచ్చింది. కిలో రూ.200 వరకు విక్రయించారు. దీంతో లక్షన్నర వరకు ఫలసాయం వచ్చింది.  

పండ్లు చూపుతున్న తోట యజమాని రత్నకుమారి


రాయితీతో సాగు

ఆనంద్‌, ఉద్యాన శాఖాధికారి  

సాగుకు హెక్టారుకు రూ.36 వేలు ఉపాధి హామీ పథకంలో సాయం చేస్తున్నాం. ఎకరానికి 1500 నుంచి రెండు వేల మొక్కలు నాటుకోవాలి. మొదటి ఏడాది నుంచి కాపు వస్తోంది. దిమ్మెలు ఏర్పాటు చేసి టైర్ల సహాయంతో చెట్లు అల్లించవచ్చు. మొదటి ఏడాది ఎకరానికి టన్ను, రెండో ఏడాది ఐదు టన్నులు, మూడో ఏడాది పది టన్నుల వరకు పండ్లు వస్తాయి. వీటిని నిల్వ చేసేందుకు ఉద్యాన శాఖ తరఫున రూ.4 లక్షలతో ప్యాక్‌హౌస్‌కు రూ.రెండు లక్షల వరకు రాయితీ ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని