logo

సున్నా వడ్డీ పంట రుణ పథకం చెక్కు అందజేత

‘రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తోంది. రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంద’ని జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ పేర్కొన్నారు.

Published : 29 Nov 2022 01:47 IST

నెల్లూరు(కలెక్టరేట్‌): ‘రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తోంది. రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంద’ని జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ పేర్కొన్నారు. సోమవారంసీఎం వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల రాయితీ, పంట నష్ట పరిహారాన్ని లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో జమ చేశారు. నెల్లూరు కలెక్టరేట్‌లో  జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.కూర్మనాథ్‌, జిల్లా వ్యవసాయాధికారి సుధాకర్‌రాజు, ఉద్యానశాఖ అధికారి సుబ్బారెడ్డి, ఎల్‌డీఎం శ్రీకాంత్‌ప్రదీప్‌కుమార్‌ పాల్గొన్నారు. అనంతరం సున్నా వడ్డీ పంట రుణ పథకం కింద జిల్లాలోని 25,695 మంది రైతులకు రూ.5.75 కోట్ల మెగా చెక్కును అందించారు. రైతుల పంట నష్టపరిహారం కింద 256 మంది రైతు లబ్ధిదారులకు రూ.15.74 లక్షల మెగా చెక్కును లబ్ధిదారులకు అందించారు. అనంతరం జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డి మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని