logo

‘వైకాపా ప్రభుత్వం తీరు దుర్మార్గం’

వైకాపా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రానికి ఖర్మ పట్టిందని నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ విమర్శించారు.

Published : 03 Dec 2022 02:23 IST

పార్టీ శ్రేణులతో అబ్దుల్‌ అజీజ్‌ తదితరులు

నెల్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే : వైకాపా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రానికి ఖర్మ పట్టిందని నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ విమర్శించారు. తెదేపా చేపట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని ఆయన నెల్లూరు గ్రామీణ మండలం సౌత్‌మోపూర్‌లో శుక్రవారం సాయంత్రం ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని, ముఖ్యంగా నెల్లూరు గ్రామీణంలో పరిస్థితి మరింత దారుణంగా తయారైందన్నారు. నగరంలోని ఒక స్కూల్లో ఆడబిడ్డపై అరాచకం జరిగిందని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని, అన్యాయం జరిగిందని చెప్పే బాధితులపైనే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వైకాపా నాయకులతో ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని, బాధితులకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జన్ని రమణయ్య, భాస్కర్‌రెడ్డి, పముజుల ప్రదీప్‌, జలదంకి సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారికి తెదేపా కండువాలు కప్పి ఆహ్వానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు