logo

పాఠశాలలో కాలం చెల్లిన చిక్కీలు

నర్రవాడ ఉన్నత పాఠశాలను శుక్రవారం వినియోగదారుల ఫోరం సభ్యులు సందర్శించగా - కాలం చెల్లిన వేరుసెనగ చిక్కీలు వెలుగుచూశాయి.

Published : 03 Dec 2022 02:23 IST

దుత్తలూరు, న్యూస్‌టుడే: నర్రవాడ ఉన్నత పాఠశాలను శుక్రవారం వినియోగదారుల ఫోరం సభ్యులు సందర్శించగా - కాలం చెల్లిన వేరుసెనగ చిక్కీలు వెలుగుచూశాయి. మార్చి నెలలో తయారుచేసినట్లు ముద్రించి ఉన్న ప్యాకెట్లు ఉన్నాయి. 60 రోజుల్లో మాత్రమే అందించాల్సిన ప్యాకెట్లు గడువు ముగిసిన తరువాత పాఠశాలలో ప్రత్యక్షమవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఇన్‌ఛార్జి ఎంఈవో బాలకృష్ణారెడ్డిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా కాలం చెల్లిన చిక్కీల విషయం నా దృష్టికి రాలేదన్నారు. శనివారం పాఠశాలకు వెళ్లి పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని