logo

ఉద్యోగుల సహకారం మరువలేనిది

జిల్లా కార్యాలయం మొదలు గ్రామ, మండల స్థాయి ఉద్యోగుల వరకు తనకు అందించిన సహకారం.. కలెక్టర్‌ నుంచి అన్నిశాఖల అధికారులు చూపిన ఆదరాభిమానాలు మరువలేనివని డీపీవో ధనలక్ష్మి అన్నారు.

Published : 04 Dec 2022 02:34 IST

డీపీవో ధనలక్ష్మిని సత్కరిస్తున్న అధికారులు, సిబ్బంది

నెల్లూరు(జడ్పీ) : జిల్లా కార్యాలయం మొదలు గ్రామ, మండల స్థాయి ఉద్యోగుల వరకు తనకు అందించిన సహకారం.. కలెక్టర్‌ నుంచి అన్నిశాఖల అధికారులు చూపిన ఆదరాభిమానాలు మరువలేనివని డీపీవో ధనలక్ష్మి అన్నారు. బదిలీపై వెళుతున్న ఆమెకు జిల్లా పంచాయతీరాజ్‌ కార్యాలయ సిబ్బంది, జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో వేర్వేరుగా శనివారం ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. జడ్పీ సీఈవో చిరంజీవి, డీఆర్వో వెంకటనారాయణమ్మ, ఇతర అధికారిణులు పాల్గొన్నారు. డీఆర్‌డీఏ పీడీ సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. డీపీవో ధనలక్ష్మి ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించడంతో పాటు ఆ పోస్టుకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారన్నారు. ఎన్నికలు, తుపాన్లు, వరదలు, కరోనా సమయంలో చక్కటి పనితీరు కనబరిచారని కొనియాడారు. ఏవోలు మాలకొండయ్య, జయకృష్ణతో పాటు ఏపీవో ఉషారాణితదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని