logo

నక్షత్ర స్కూలు ఘటనపై పోక్సో కేసు నమోదు

ఎట్టకేలకు నక్షత్ర పాఠశాల ఘటనపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. విద్యార్థినిపై వేధింపులకు పాల్పడిన ఇద్దరిపై బాధిత తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు.

Published : 04 Dec 2022 02:34 IST

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే : ఎట్టకేలకు నక్షత్ర పాఠశాల ఘటనపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. విద్యార్థినిపై వేధింపులకు పాల్పడిన ఇద్దరిపై బాధిత తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు. మాగుంట లేఅవుట్‌లోని నక్షత్ర పాఠశాలలో చదువుతున్న ఓ బాలిక చిట్టీలతో పరీక్ష రాస్తుండగా స్కూల్‌ కరస్పాండెంట్‌ జీవనకృష్ణ గుర్తించారు. అప్పటి నుంచి ఆయన, బస్సు డ్రైవరు మహేష్‌ చిన్నారిని వేధింపులకు గురిచేస్తున్నారని బాలిక తల్లి శుక్రవారం పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. బాలిక తల్లి ఆరోపణలను స్కూలు యాజమాన్యం తోసిపుచ్చింది. సీసీ కెమెరాలను పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. శనివారం బాలిక తల్లి ఫిర్యాదు మేరకు బాలాజీనగర్‌ పోలీసులు స్కూలు కరెస్పాండెంట్‌ జీవన్‌కృష్ణ, బస్సు డ్రైవరు మహేష్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. నగర డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని