logo

56 ఏళ్లుగా ఎన్టీఆర్‌పై మమకారం

దేవుడంటే ఎన్టీఆర్‌ అనేలా తన మనసులో ముద్రించుకున్నారాయన. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన నటించిన చిత్రాలకు సంబంధించిన ఫొటోలు, పత్రికల్లో వచ్చిన కథనాలు సేకరించారు.

Published : 20 Jan 2023 01:30 IST

శ్రీనివాసులు ఇంట్లో ఎన్టీఆర్‌ చిత్రపటాలు

న్యూస్‌టుడే, సీతారామపురం: దేవుడంటే ఎన్టీఆర్‌ అనేలా తన మనసులో ముద్రించుకున్నారాయన. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన నటించిన చిత్రాలకు సంబంధించిన ఫొటోలు, పత్రికల్లో వచ్చిన కథనాలు సేకరించారు. తన కుడి చేతిపై ఎన్టీఆర్‌ చిత్రాన్ని, పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నారు.  సీతారామపురం మండలం పెద్దనాగంపల్లికి చెందిన కామనూరు శ్రీనివాసులు(63) తన ఏడోఏట శ్రీకృష్ణ అవతారం చిత్రం చూసి ఎన్టీఆర్‌కు వీరాభిమానిగా మారిపోయారు. బెంగళూరులో తండ్రి ఆర్మీలో పనిచేస్తుండగా తదనంతరం ఇతను కూడా చేరి 2020 సెప్టెంబరులో పదవీ విరమణ పొందారు. అనంతరం పెద్దనాగంపల్లిలో స్థిరపడ్డారు. చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్‌ నటించిన చిత్రాలను సేకరించి ఫ్రేములు కట్టించి తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్నారు. శ్రీనివాసులు ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ సుమారు 80 చిత్రాలు ఉండగా, బెంగళూరులోని ఇంట్లో మరో 40 ఫొటోలున్నాయని, కుమారుడు శ్రీధర్‌ సైతం బాలకృష్ణకు వీరాభిమాని అని వివరించారు. కామనూరు శ్రీనివాసులు మాట్లాడుతూ 56 ఏళ్లుగా ఎన్టీఆర్‌ అభిమానినని, అయన పేరుతో మరిన్ని సేవాకార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

చేతిపై ఎన్టీఆర్‌ పచ్చబొట్టు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని