logo

భక్తిశ్రద్ధలతో తై అమావాస్య

నెల్లూరు దర్గామిట్టలోని శ్రీ వైద్య వీరరాఘవ స్వామి దేవస్థానంలో శనివారం తై అమావాస్య సందర్భంగా తిరుణాల జరిగింది.

Published : 22 Jan 2023 02:49 IST

ఉప్పు, మిరియాలతో శివలింగానికి అభిషేకం

నెల్లూరు దర్గామిట్టలోని శ్రీ వైద్య వీరరాఘవ స్వామి దేవస్థానంలో శనివారం తై అమావాస్య సందర్భంగా తిరుణాల జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులుతీరారు. మొక్కులు తీర్చుకునే క్రమంలో దేవస్థానం ప్రాంగణంలోని శివలింగపై ఉప్పు మిరియాలు పోశారు. ఆపై వేమాలశెట్టి బావి వద్దకు చేరుకుని బెల్లం వేసి కొబ్బరికాయలను కొట్టి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దంపతులు, తెదేపా జిల్లా పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి అబ్దుల్‌అజీజ్‌ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.

  వైద్య వీర రాఘవస్వామి దర్శనానికి భక్తుల బారులు

వేమాలశెట్టి బావి వద్ద పూజలు..

  న్యూస్‌టుడే నెల్లూరు (సాంస్కృతికం)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని