logo

ఉగాది నాటికి గృహ ప్రవేశాలు

మండలంలోని జమ్మలపాలెం జగనన్న కాలనీల్లో పక్కా గృహాలు మంజూరైన లబ్ధిదారులు త్వరగా నిర్మాణాలు పూర్తి చేసుకొని ఉగాది నాటికి గృహ ప్రవేశాలు పూర్తవ్వాలని సాంఘిక సంక్షేమశాఖ డీడీ, మండల ప్రత్యేకాధికారిణి రమాదేవి సూచించారు.

Published : 22 Jan 2023 02:49 IST

వివరాలు తెలుసుకుంటున్న రమాదేవి

జలదంకి, న్యూస్‌టుడే: మండలంలోని జమ్మలపాలెం జగనన్న కాలనీల్లో పక్కా గృహాలు మంజూరైన లబ్ధిదారులు త్వరగా నిర్మాణాలు పూర్తి చేసుకొని ఉగాది నాటికి గృహ ప్రవేశాలు పూర్తవ్వాలని సాంఘిక సంక్షేమశాఖ డీడీ, మండల ప్రత్యేకాధికారిణి రమాదేవి సూచించారు. శనివారం మండలంలోని జమ్మలపాలెంలో పక్కాగృహాల నిర్మాణాలను తహసీల్దార్‌ పద్మావతి, ఎంపీడీవో శ్రీధర్‌బాబులతో కలసి ఆమె పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. నూతనంగా ఏర్పాటు చేసిన లేఅవుట్‌లోకి ఇసుక, సిమెంట్‌, నిర్మాణ సామగ్రిని తెచ్చుకునేందుకు అంతర్గత రోడ్లు లేకపోవటంతో కొద్దిపాటి వర్షానికే చిత్తడిచిత్తడిగా మారి అవస్థలు పడుతున్నామని వాపోయారు. తక్షణమే కేయూ రోడ్డు నుంచి కాలనీలోకి సిమెంట్‌ రోడ్డు ఏర్పాటు చేసి రవాణా వసతులు కల్పించాలని కోరారు. ఇటుక ధరలు సైతం వ్యాపారులంతా ఏకమై భారీగా రేట్లు పెంచడంతో నిర్మాణాలు చేపట్టలేకపోతున్నామని వివరించారు. సమస్యలను ఉన్నతాధికారులకు తెలిపి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. హౌసింగ్‌ డీఈ శ్రీనివాసులు, ఏఈ ప్రసాద్‌, విద్యుత్తు ఏఈ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Read latest Nellore News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని