కావాలోయ్.. చైతన్య ఓటు
ఓటర్ల దినోత్సవం రోజు కొత్తగా ఓటుహక్కు పొందేవారిని సత్కరిస్తారు. విద్యా సంస్థల్లో ప్రతిజ్ఞ చేయిస్తారు.
ఓటర్ల దినోత్సవం రోజు కొత్తగా ఓటుహక్కు పొందేవారిని సత్కరిస్తారు. విద్యా సంస్థల్లో ప్రతిజ్ఞ చేయిస్తారు. ఓటుహక్కు గొప్పతనం.. విలువ తెలిసేలా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ తదితర పోటీలు నిర్వహిస్తారు. ఓటు హక్కు తెలిపే అంశాలతో పాటలు పాడిస్తారు. ‘ఓటరుగా ఉన్నందుకు గర్వపడుతున్నా.. ఓటేయడానికి సిద్ధంగా ఉన్న’ అన్న నినాదంతో బ్యాడ్జీలను పంపిణీ చేస్తారు. బుధవారం సాయంత్రం కస్తూర్బా కళాక్షేత్రంలో అధికారులు ఓటరు దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు.
ఈనాడు డిజిటల్, నెల్లూరు: కలెక్టరేట్, కావలి, న్యూస్‌టుడే
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకం. నేతల తలరాతలు మార్చేది.. ప్రజలకు నచ్చిన వ్యక్తికి పట్టం కట్టేదీ ఓటే. ఆ మాటకొస్తే.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో సామాన్యుడి వజ్రాయుధం ఓటే. మనల్ని మనం పరిపాలించుకునే.. ఎవరు పరిపాలించాలో నిర్ణయించుకునే సదావకాశం. అందుకే.. అయిదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగాన్ని భారంగా కాకుండా.. బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలి. నిజాయతీపరులు.. దార్శనికులకు ఎన్నుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పది కాలాలు వర్ధిల్లుతుంది. నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కథనం.
మార్పు తెద్దాం..
నేడు రాజకీయాల ప్రధాన లక్ష్యం.. ఎలాగైనా అధికారాన్ని పొందాలనేలా మారింది. ఆ క్రమంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు. కులం, మతం, ప్రాంతాల వారీగా విభేదాలు సృష్టిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారాన్ని, ప్రజా ప్రయోజనాన్ని పక్కనపెట్టి.. అత్యధికులు.. అధికారాన్ని హస్తగతం చేసుకున్నాక పెట్టుబడికి పదింతలు సంపాదించాలన్న భావన.. వ్యక్తిగత స్వార్థంతో వ్యవహరిస్తున్న పరిస్థితి. దీంతో రాజకీయ నాయకులన్నా.. ప్రజాప్రతినిధులన్నా ప్రజల్లో నానాటికి గౌరవభావం సన్నగిల్లుతోంది. ఇవన్నీ ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధం. ఇలాంటి ఉల్లంఘనలు ఎక్కడ జరిగినా యువజన సంఘాలు నిఘా వేయాలి.
యువ ఓటర్లే కీలకం..
జిల్లాలో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే వారిలో యువత, మధ్య వయస్కుల పాత్ర ఎక్కువగా ఉంది. వృద్ధులు, మధ్య వయస్కుల ఆలోచనలు చాలా వరకు స్థిరంగా ఉన్నా.. యువత ఆలోచన మాత్రం భిన్నంగా ఉంటుంది. జిల్లాలో సుమారు 38వేల మంది కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోగా.. వీరిలో 80 శాతానికి పైగా యువతే ఉండటం విశేషం. వీరు వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారనున్నారు. ఆ నేపథ్యంలోనే వారంతా బాధ్యతగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉంది.
మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. పోరాడి రాజులు అవుతారో.. ఓటును అమ్ముకుని బానిసలు అవుతారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించాలని 2011లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఏర్పడింది. దాంతో ఈ సంఘం ఏర్పడిన జనవరి 25ఇనే ఓటర్ల దినోత్సవం జరపాలని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం భావించింది. కేంద్ర న్యాయశాఖ చేసిన ఈ ప్రతిపాదనను.. నాటి కేంద్ర మంత్రివర్గం ఆమోదించడంతో.. ఏటా జనవరి 25న నిర్వహిస్తూ వస్తున్నారు.
హక్కు వచ్చింది..
- నరేంద్రనాథ్‌రెడ్డి, బీటెక్ విద్యార్థి
నేను అనంతపురం జేఎన్టీయూలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నా. కొన్నాళ్ల కిందట మా కళాశాలలో ఎన్నికలు- ఓటుహక్కు- ఓట్లు తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఓటుహక్కు పొందాను. కార్డు కూడా వచ్చింది. నా ఓటు ఉచిత వాగ్దానాలు.. ప్రలోభాలకు లొంగదు. యువతకు ఉద్యోగ అవకాశాలను ముమ్మరం చేస్తామనే నాయకులకే వేస్తా.
ప్రలోభాలకు దూరంగా..
యువతలో సామాజిక చైతన్యం పెంపొందాలి. 18 ఏళ్లు రాగానే ప్రతి ఒక్కరూ ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి. మంచి అభ్యర్థులను ఎన్నుకోవడంతో పాటు చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి. ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా సదాభిప్రాయం ఉన్న వారినే చట్ట సభలకు పంపాలి. అప్పుడే ప్రజలకు మంచి జరుగుతుంది.
పువ్వాడ హేమ సుకీర్తన, జనతాపేట, కావలి
మంచి నాయకులనే ఎన్నుకుందాం
గత ఏడాది ఏప్రిల్ నాటికి నాకు 18 ఏళ్లు నిండాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా. కొత్తగా ఓటుహక్కు పొందా. మంచి నాయకుడిని పాలకుడిగా ఎన్నుకొనేందుకు ఉత్సుకతతో ఉన్నా. ప్రజాస్వామ్య పాలనలో ఓటు అనేది అందరూ వజ్రాయుధంగా భావించాలి.
చల్లా శారదాప్రియ, బీఫార్మసీ, విద్యార్థిని
జిల్లాలో ఇలా..
మొత్తం ఓటర్లు: 19,13,321
పురుషులు: 9,39,273
స్త్రీలు: 9,73,802
ఇతరులు: 246
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Nara Lokesh: 45 ఏళ్లు దాటిన మహిళలకు పింఛను.. ఆ హామీ ఏమైంది?: నారా లోకేశ్
-
Movies News
SRK: సింహాలు ఇంటర్వ్యూల్లో పాల్గొనవు.. నేనూ అంతే : షారుఖ్ ఖాన్
-
India News
Ladakh: తూర్పు లద్దాఖ్ వద్ద వ్యూహాత్మక రహదారి నిర్మాణం ప్రారంభం
-
General News
NTR-Kalyan Ram: బెంగళూరు చేరుకున్న ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్
-
Sports News
IND Vs NZ : రెండో టీ20లో ఉమ్రాన్ స్థానంలో అతడిని తీసుకోవాలి : మాజీ క్రికెటర్
-
India News
S Jaishankar: ‘అది 1962లోనే జరిగింది..’ రాహుల్‌కు జైశంకర్ కౌంటర్