logo

నవ జీవన విద్యా‘కాంతి’

కొండలా పేరుకున్న చెత్తకుప్పలు.. దాహం వేస్తే కాలువలో ప్రవహించే నీరు.. రాత్రయితే అంధకారం.. ఇలా వ్యర్థాల మధ్య జీవనం సాగిస్తున్న నిరుపేద చిన్నారులకు విద్యా బుద్ధులు నేర్పిస్తోంది నవజీవన్‌ స్వచ్ఛంద సేవా సంస్థ.

Published : 26 Jan 2023 01:58 IST

కొండలా పేరుకున్న చెత్తకుప్పలు.. దాహం వేస్తే కాలువలో ప్రవహించే నీరు.. రాత్రయితే అంధకారం.. ఇలా వ్యర్థాల మధ్య జీవనం సాగిస్తున్న నిరుపేద చిన్నారులకు విద్యా బుద్ధులు నేర్పిస్తోంది నవజీవన్‌ స్వచ్ఛంద సేవా సంస్థ. నెల్లూరు నగరపాలక సంస్థ పర్యవేక్షణలోని దొంతాలి డంపింగ్‌ యార్డులో ప్లాస్టిక్‌ సీసాలు, ఇతర వ్యర్థాలు సేకరించుకుని సుమారు 10 నుంచి 15 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరింతా నిరక్ష్యరాస్యులు. దీంతో తమ బిడ్డలు సుమారు 20 మందిని కూడా వీరు తమతో పాటే వ్యర్థాలు ఏరుకునేందుకు యార్డుకు తీసుకువెళుతున్నారు. ఈ పరిస్థితి అంతా తెలిసినా అధికారులు ఎవరూ వారిపై దృష్టి పెట్టలేదు. చివరకు స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చి నెలకు రూ.అయిదు వేల జీతమిచ్చి.. సమీప గ్రామంలో నివాసం ఉండే శివమ్మను ఉపాధ్యాయురాలిగా నియమించింది. ఆమె రోజూ రెండు కి.మీ. నడిచి వచ్చి ఆ చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. ప్రభుత్వమే ఇలాంటి పిల్లల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈనాడు నెల్లూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని