logo

గణతంత్ర శోభ

జిల్లా గణతంత్ర దినోత్సవానికి ముస్తాబైంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేశారు.

Published : 26 Jan 2023 01:58 IST

ముస్తాబైన పోలీసు కవాతు మైదానం

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: జిల్లా గణతంత్ర దినోత్సవానికి ముస్తాబైంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేశారు. నెల్లూరులోని పోలీసు కవాతు మైదానంలో తగిన ఏర్పాట్లు చేశారు. ఇక్కడ గురువారం ఉదయం 9 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్నాయి. కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, 9.05కు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. 9.20కి జిల్లా ప్రగతిపై ప్రసంగిస్తారు. 9.40కు జిల్లా ప్రగతి శకటాల ప్రదర్శన, 10 గంటలకు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, 10.40కి ఉత్తమ అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు ప్రదానం చేయనున్నారు. 11.55కు జాతీయ గీతాలాపనతో ముగియనుంది.

705 మందికి అవార్డులు.. గత ఏడాది కాలంలో విధుల్లో ప్రతిభ చూపిన వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు 705 మందికి ప్రశంసా పత్రాలు అందించనున్నారు. వీరిలో 46 మంది జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు. అత్యధికంగా జిల్లా సర్వే, ల్యాండ్‌ రికార్డ్సు శాఖకు 64 అవార్డులు ప్రకటించారు. జేసీ కూర్మనాథ్‌, కందుకూరు సబ్‌ కలెక్టర్‌ ఎస్‌.ఎస్‌.శోభిక, వీఎస్‌యూ రిజిస్ట్రార్‌ పి.రామచంద్రారెడ్డి, కలెక్టరేట్‌ ఏవో షేక్‌ షఫీమాలిక్‌, జిల్లా సర్వే భూ రికార్డుల అధికారి హనుమాన్‌ప్రసాద్‌, సెబ్‌ జేడీ కె.శ్రీలక్ష్మి, కావలి ఆర్డీవో శీనానాయక్‌, జిల్లా అగ్నిమాపకశాఖ విపత్తు నిర్వహణ అధికారి శ్రీకాంత్‌రెడ్డి, 108 సేవల జిల్లా సమన్వయకర్త ఎం.పవన్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

జంబో జాబితా... సాధారణంగా ఆయా రంగాల్లో విశిష్ఠ సేవలందించిన వారికి స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఉత్తమ సేవా పురస్కారాలు అందించడం పరిపాటి. గతం ఈ జాబితా పరిమితంగానే ఉండేది. మొదట్లో పదుల సంఖ్యలో ఉండగా.. తర్వాత వందల సంఖ్యకు చేరింది. గత మూడేళ్ల కాలంలో పరిశీలించినా.. ఈ సంఖ్య 500కు మించి లేదు. ఈ దఫా ఏకంగా 705 మందికి ఇవ్వడం చర్చనీయాంశమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని