logo

ఇంటింటికీ జనసేనాని

వైకాపా ప్రభుత్వ పాలనలో ప్రజలపై పడ్డ భారాన్ని వివరించేందుకు.. వారి సమస్యలను తెలుసుకునేందుకు త్వరలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ నెల్లూరు నుంచే గడప గడపకు వెళ్లే కార్యక్రమం చేపడతారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్‌రెడ్డి తెలిపారు.

Published : 27 Jan 2023 01:41 IST

నెల్లూరు నుంచే కార్యక్రమం

పవన్‌కల్యాణ్‌తో మనుక్రాంత్‌రెడ్డి, సుజయ్‌బాబు

నెల్లూరు(వీఆర్సీ సెంటరు), న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వ పాలనలో ప్రజలపై పడ్డ భారాన్ని వివరించేందుకు.. వారి సమస్యలను తెలుసుకునేందుకు త్వరలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ నెల్లూరు నుంచే గడప గడపకు వెళ్లే కార్యక్రమం చేపడతారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్‌రెడ్డి తెలిపారు. ‘వైకాపా పాలనలో ప్రజల బతుకు భారం’ అనే అంశంపై రూపొందించిన గోడపత్రాన్ని గురువారం విజయవాడలో పవన్‌కల్యాణ్‌ చేతుల మీదుగా ఆవిష్కరింపజేసినట్లు వివరించారు.  ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు పాలనను ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తామన్నారు. పార్టీ ఆదేశిస్తే నగరం నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తానన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు సుజయ్‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వారాహి అడుగుపెట్టిన వెంటనే వైకాపా నాయకుల్లో భయం మొదలైందన్నారు. నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు, కోలా విజయలక్ష్మి, కలువాయి సుధీర్‌, వరకుమార్‌, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు