logo

ఎంతైనా ఎంపీ కారు కదా!

ఆయన రాజ్యసభ సభ్యుడు. కావలి వాస్తవ్యులు కావడంతో స్థానికంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూఉంటారు. గురువారం పట్టణంలోని రైల్వే వీధికి వచ్చారు.

Published : 27 Jan 2023 01:41 IST

- న్యూస్‌టుడే, కావలి

ఆయన రాజ్యసభ సభ్యుడు. కావలి వాస్తవ్యులు కావడంతో స్థానికంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూఉంటారు. గురువారం పట్టణంలోని రైల్వే వీధికి వచ్చారు. ఆ వీధిలో  సాధారణంగానే వాహన రాకపోకలతో రద్దీగా ఉంటుంది. అలాంటి సందులోకి ఆయన వాహనం వచ్చింది. అదే సమయంలో 108 వాహనం కూడా వచ్చింది. సైరన్‌ మోగించినా, ఆ ఎంపీ కారు కదల్లేదు. పోలీసులు కాస్త పక్కకు తప్పించాలనే ప్రయత్నం చేశారు. వీలు కాలేదు. ఎట్టకేలకు ఆ ప్రజాప్రతినిధి వచ్చారు. కారులో ఎక్కాక కూడా పలువురిని పలకరిస్తూ వెళ్లారు. అప్పటివరకు 108 వాహనం ఆగక తప్పలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు