logo

పనితీరుకు పట్టం

జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన 705 మంది ఉద్యోగులు, సిబ్బందికి కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు ప్రశంసాపత్రాలు అందించారు.

Updated : 27 Jan 2023 02:44 IST

ఏఆర్‌ డీఎస్పీ ఎం.గాంధికి డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన ప్రతిభా పురస్కారాన్ని అందిస్తున్న ఎస్పీ విజయరావు

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే : జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన 705 మంది ఉద్యోగులు, సిబ్బందికి కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు ప్రశంసాపత్రాలు అందించారు. గురువారం పోలీసు కవాతు మైదానంలో జరిగిన గణతంత్ర దినోత్సవంలో అవార్డులు అందుకున్న వారిని ఆయన అభినందించారు. పలు శాఖలు ప్రదర్శించిన జిల్లా అభివృద్ధి ప్రగతి శకటాలు ఆకట్టుకున్నాయి. ప్రదర్శనలో అగ్నిమాపక, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ శకటాలు ప్రథమ బహుమతిని, ఐటీడీఏ, పంచాయతీరాజ్‌శాఖ శకటాలు ద్వితీయ, వైద్య, ఆరోగ్యశాఖ, అటవీశాఖల శకటాలు తృతీయ బహమతిని దక్కించుకున్నాయి. సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్‌ చక్రధర్‌బాబు జ్ఞాపికలను అందించారు.

ద్వితీయ స్థానంలో నిలిచిన పంచాయతీ కార్యాలయ శకటం

ప్రథమ బహుమతి సాధించిన డీఆర్‌డీఏ శకటం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు