logo

సమాజంలో మంచి పౌరులుగా జీవించండి

సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని జైలు నుంచి విడుదలైన ముగ్గురు ఖైదీలకు కేంద్ర కారాగార సూపరింటెండెంట్‌ రాజేశ్వరరావు సూచించారు.

Published : 27 Jan 2023 01:41 IST

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే : సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని జైలు నుంచి విడుదలైన ముగ్గురు ఖైదీలకు కేంద్ర కారాగార సూపరింటెండెంట్‌ రాజేశ్వరరావు సూచించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం కేంద్ర కారాగారంలో కలతూరు వెంకటేష్‌ అలియాజ్‌ కర్రి, ఆవుల శ్రీధర్‌, కైలాసం రాజారెడ్డి అలియాజ్‌ రాజా అలియాజ్‌ జిలానీ విడుదలయ్యారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రసాదించిన ఖైదీ క్షమాభిక్షలో భాగంగా జీవితేతర ఖైదీలు విడుదలయ్యారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను సూపరింటెండెంట్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు సూపరింటెండెంట్‌ ఎం.మహేష్‌ బాబు, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఏబీ కాంతరాజ్‌, వైద్యాధికారులు, జైలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు