logo

ఘర్షణలో వ్యక్తి మృతి

మండల పరిధి అయ్యవారిపల్ల్లె గ్రామంలో పొలం విషయంలో తలెత్తిన ఘర్షణ నేపథ్యంలో నలుగురు దాడి చేయడంతో ఒక వ్యక్తి మృతి చెందారు.

Published : 27 Jan 2023 01:41 IST

వలేటివారిపాలెం, న్యూస్‌టుడే: మండల పరిధి అయ్యవారిపల్ల్లె గ్రామంలో పొలం విషయంలో తలెత్తిన ఘర్షణ నేపథ్యంలో నలుగురు దాడి చేయడంతో ఒక వ్యక్తి మృతి చెందారు. ఎస్సై సుదర్శన్‌ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన మల్లెబోయిన అంజయ్య, అదే గ్రామానికి చెందిన డేగా వేణు, డేగా శివరామయ్య, డేగా అయ్యన్న, డబ్బుగొట్టు మహేష్‌ల మధ్య పొలం విషయంలో గత పది సంవత్సరాలుగా వివాదం ఉంది. ఈ నేపథ్యంలో అంజయ్య(55) గురువారం బస్టాండు నుంచి ఇంటికి వెళుతుండగా ఆ నలుగురూ దాడికి పాల్పడ్డారు. ఆపై గొంతుపిసికి, తలపై బాదుతూ నెట్టారు. దీంతో అంజయ్య రోడ్డుపైనే మృతి చెందారని మృతుని భార్య ధనమ్మ ఫిర్యాదు చేశారని ఎస్సై పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు