logo

మండలాల ఖాళీ స్థానాలకు 3న ఎన్నిక

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జిల్లాలో ఖాళీగా ఉన్న మండలాల స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నిక ప్రక్రియను అధికారులు మొదలు పెట్టారు.

Published : 29 Jan 2023 01:35 IST

ప్రక్రియ ప్రారంభం

నెల్లూరు(జడ్పీ), న్యూస్‌టుడే : రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జిల్లాలో ఖాళీగా ఉన్న మండలాల స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నిక ప్రక్రియను అధికారులు మొదలు పెట్టారు. దీనికి సంబంధించిన ఆదేశాలను కలెక్టర్‌ చక్రధర్‌బాబు శనివారం విడుదల చేశారు. జడ్పీ సీఈవో చిరంజీవి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ ప్రారంభించారు. ఇందులో భాగంగా జలదంకి మండల కోఆప్షన్‌ సభ్యుడు, వెంకటాచలం ఉపాధ్యక్ష పదవి, పొదలకూరు మండల పరిధిలోని తోడేరు పంచాయతీకి ఉప సర్పంచి స్థానానికి ఫిబ్రవరి 3న ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించారు. స్థానిక ఎంపీడీవోల ఆధ్వర్యంలో జరిగే ఈ ఎన్నిక నిర్వహణకు ప్రత్యేక అధికారులను నియమించారు. దీనికి సంబంధించిన కార్యాచరణను జడ్పీ అధికారులు వెల్లడించారు.

* జనవరి 30వ తేదీలోగా ఫారం 2 ప్రకారం మండలాల సభ్యులకు ఎన్నిక నోటీసు ఇవ్వాలి.

* ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 10 నుంచి నామినేషన్లు వేయాలి.

* 12 గంటల్లోగా నామినేషన్లను పరిశీలించాలి. వెంటనే పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు ప్రకటించాలి.

* ఒంటి గంటలోపు నామినేషన్‌ ఉపసంహరించుకోవచ్చు.

* మధ్యాహ్నం 3 గంటల నుంచి సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పరోక్ష పద్ధతిలో ఆయా అభ్యర్థులను ఎన్నుకోవాల్సి ఉంటుంది.

* ఎన్నికైనా అభ్యర్థులను వెంటనే సభ్యుల ముందే ప్రకటిస్తారు.

* ఏ కారణం చేతనైనా ఎన్నిక వాయిదా పడితే.. మరుసటి రోజు ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని