logo

వైభవం.. సప్తవాహనోత్సవం

రథ సప్తమి శోభతో శనివారం ఆలయాలు కళకళలాడగా- సప్త వాహనాలపై కొలువైన దేవదేవుని దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వం పొందారు.

Published : 29 Jan 2023 01:58 IST

కొండబిట్రగుంటలో ప్రసన్న వేంకటేశ్వరుడికి దీపోత్సవం

థ సప్తమి శోభతో శనివారం ఆలయాలు కళకళలాడగా- సప్త వాహనాలపై కొలువైన దేవదేవుని దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వం పొందారు. నెల్లూరు రంగనాయకులపేటలోని శ్రీరంగనాథ స్వామి దేవస్థానంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సూర్యప్రభ, గరుడ, సింహ, హంస వాహన సేవలు నిర్వహించారు. మధ్యాహ్నం బంగారు తిరుచ్చి, సాయంత్రం పెద్ద శేషవాహనం, రాత్రి చంద్రప్రభ వాహన సేవలు జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేత రంగనాథుని స్నపన తిరుమంజనాన్ని ప్రధానార్చకులు కిడాంబి జగన్నాథాచార్యులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెంచలకోన, కొండ బిట్రగుంటలోనూ రథ సప్తమి వేడుకలు కనుల పండువగా సాగాయి. నెల్లూరు మూలాపేటలోని ద్రౌపతీ సమేత శ్రీకృష్ణ ధర్మరాజ స్వామి, రుక్మిణీసత్యభామ సమేత వేణుగోపాలస్వామి, బాలాజీ నగర్‌ సీతారామ మందిరంలో వైభవంగా వేడుకలు జరిగాయి.

న్యూస్‌టుడే, నెల్లూరు(సాంస్కృతికం)

సూర్యప్రభపై రంగనాథస్వామి..

చంద్రప్రభ వాహన సేవ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని