logo

ముగిసిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన

విద్యార్థులకు ప్రస్తుతం ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని ఒడిసి పట్టుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్‌ చక్రవర్తి పిలుపునిచ్చారు.

Published : 30 Jan 2023 01:48 IST

విద్యార్థులతో ఎమ్మెల్సీ కల్యాణ్‌చక్రవర్తి, విద్యాశాఖ జేడీ రామలింగం తదితరులు

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే : విద్యార్థులకు ప్రస్తుతం ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని ఒడిసి పట్టుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్‌ చక్రవర్తి పిలుపునిచ్చారు. నగరంలోని దర్గామిట్ట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రెండురోజుల పాటు జిల్లాస్థాయిలో నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల చదువులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. ‘నాడు- నేడు’తో మౌలిక వసతులు కల్పిస్తోందని, వీటిని వినియోగించుకోవాలని తెలిపారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నారు. అనంతరం రాష్ట్ర పోటీలకు ఎంపికైన 10 మంది విద్యార్థులకు ఆయన ప్రశంసాపత్రాలు అందించారు. వరుసగా వై.భావన (బిట్రగుంట జడ్పీ బాలికల పాఠశాల), ఎన్‌.సూర్య (విడవలూరు జడ్పీ పాఠశాల), రాధిక (ఎంవీపాళెం జడ్పీ పాఠశాల), ఎస్‌కే ఆషిద్‌ (ఊనుగుంటపాళెం పాఠశాల), పీవీఎస్‌ సిద్ధార్థ (రామాయపట్నం పాఠశాల), మనోజ (నిడిగుంటపాళెం జడ్పీ పాఠశాల), కేవీఎస్‌ సాయితేజ (పెనుబల్లి జడ్పీ పాఠశాల), పి.సింధు (ఏపీ ఎంజేపీ బీసీడబ్ల్యూఆర్‌జీ),  టి.లక్ష్మీనరసింహ (కొండాపురం ఏపీ మోడల్‌ స్కూల్‌), అనన్య చరిత (మర్రిపాడు ఏపీమోడల్‌ స్కూల్‌) విజేతలుగా నిలిచి రాష్ట్ర పోటీలకు అర్హత సాధించారు. కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్‌ మువ్వా రామలింగం, ఆర్జేడీ సుబ్బారావు, ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ సీహెచ్‌ ఉషారాణి, ఇన్‌ఛార్జి డీఈవో గ్లోరికుమారి, జిల్లా సైన్సు అధికారి శ్రీనివాసులు, సైన్సు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని