logo

బ్యాటరీ సైకిల్‌!

బ్యాటరీ బైకులు.. బ్యాటరీ కారులు.. ఆటోలు చూశాంగానీ బ్యాటరీ సైకిల్‌ను చూశారా? ఎప్పుడైనా దానిపై ఎవరైనా కూర్చొని ప్రయాణించారా? మైలేజ్‌ ఎంత వస్తుంది.. ఈ ప్రశ్నలకు సమాధానం నెల్లూరులో లభిస్తుంది.

Updated : 30 Jan 2023 12:16 IST

ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 50 కి.మీ. మైలేజీ

న్యూస్‌టుడే, నెల్లూరు (వీఆర్సీ సెంటరు): బ్యాటరీ బైకులు.. బ్యాటరీ కారులు.. ఆటోలు చూశాంగానీ బ్యాటరీ సైకిల్‌ను చూశారా? ఎప్పుడైనా దానిపై ఎవరైనా కూర్చొని ప్రయాణించారా? మైలేజ్‌ ఎంత వస్తుంది.. ఈ ప్రశ్నలకు సమాధానం నెల్లూరులో లభిస్తుంది. జిల్లా కేంద్రమైన నెల్లూరులో ఓ వ్యక్తి వినూత్నంగా బ్యాటరీ సైకిల్‌ మార్కెట్లోకి తెచ్చారు. తైవాన్‌ నుంచి వస్తువులు తెప్పించి మరీ ఈ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 50 కిలోమీటర్ల వరకు మైలేజీ వస్తుంది. 25.9 వాట్స్‌తో కలిగిన విద్యుత్తు శక్తితో ఈ సైకిల్‌ పనిచేస్తుంది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. వాటర్‌ ప్రూఫ్‌తో కూడిన ఈ సైకిల్‌ ఒక ఏడాది వారంటీతో పాటు వస్తుంది. మన వద్ద పాత సైకిల్‌ ఉన్నా.. అది ఎలాంటిదైనా సరే.. ఈ కిట్‌ను అమర్చుతారు. దీనికి లైట్‌ కూడా ఉంటుంది. హ్యాండిల్‌కు ఎక్సలేటరు ఉంటుంది. నెల్లూరుకు చెందిన సుధా మాధవ్‌ అనే సైకిళ్ల వ్యాపారి వీటిని విక్రయిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ, తూర్పు గోదావరి, హైదరాబాద్‌కు సైకిళ్లు పంపించారు. లుథియానా నుంచి ఆర్డర్లు వస్తున్నాయంటే సైకిల్‌ క్రేజీ అలాంటిది మరి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని