logo

పొర్లుకట్ట పటిష్ఠం.. ప్రతిపాదనలకే పరిమితం

జిల్లాలోని సంగం బ్యారేజికి దిగువన పెన్నా నది పటిష్టత మాటలకే పరిమితమైంది. దీంతో వరదల సమయంలో నది పొంగుతుంది. సమీపంలోని ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి.

Published : 30 Jan 2023 01:48 IST

సంగం, న్యూస్‌టుడే

సంగం బ్యారేజి దిగువన ధ్వంసమైన నది గట్టు

జిల్లాలోని సంగం బ్యారేజికి దిగువన పెన్నా నది పటిష్టత మాటలకే పరిమితమైంది. దీంతో వరదల సమయంలో నది పొంగుతుంది. సమీపంలోని ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ గట్టు 2021 నవంబరు నెలలో వరదలకు ధ్వంసమైంది. అప్పటి నుంచి మరమ్మతులు జరగలేదు. పెన్నా నదికి  భారీ వరద ప్రవాహం వస్తే ముప్పు తప్పదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం ప్రతిపాదనలు పంపాం, ప్రభుత్వం ఆమోదిస్తే చేస్తామంటూ కాలయాపన చేస్తున్నారు.

5.5 లక్షల వరదతో..

2021 నవంబరు 19, 20 తేదీల్లో సంగం ఆనకట్ట మీదుగా పెన్నా నదిలో 5.5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహించింది. ఆసమయంలో సంగం బ్యారేజీకి దిగువన గట్టు దాటి సమీప ప్రాంతాలను ముంచెత్తింది. ఆసమయంలో బుచ్చిరెడ్డిపాళెం మినగల్లు సమీపంలో  గండి పడడంతో వరద ముంచేసింది. ఆతరువాత షరా మామూలుగా అధికారులు పరిశీలించి, యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామన్నారు. ఆతరువాత పత్తా లేరు.

రూ.66 లక్షలతో ప్రతిపాదనలు  

తెలుగు గంగ ఏఈ విజయరామిరెడ్డి  మాట్లాడుతూ రూ.66 లక్షలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఆమోదం లభించిన వెంటనే పనులు చేస్తామని వివరించారు.

స్వయంగా మంత్రి పరిశీలించినా..

గత ఏడాది మేనెల తొమ్మిదో తేదీన జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తొలిసారిగా సంగం బ్యారేజి వద్దకు వచ్చారు. సంగం వాసులు ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆయనతో పాటు , వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, జిల్లా పాలనాధికారి కె.వి.ఎన్‌.చక్రధర్‌బాబు తదితరులు పరిశీలించారు. వెంటనే మరమ్మతులు చేయాలని, ప్రమాదం జరగకుండా పటిష్టం చేయాలని అంబటి రాంబాబు ఆదేశించారు. ఇప్పటికీ అతీ గతి లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని