logo

Kotamreddy: అనుమానం ఉన్నచోట.. కొనసాగడం కష్టం : కోటంరెడ్డి

‘వైకాపా అధిష్ఠానం కొత్త నాటకానికి తెరదీసింది. ప్రస్తుతం వైకాపా రాష్ట్ర సేవాదళ్‌ అధ్యక్షుడిగా ఉన్న గిరిధర్‌రెడ్డికి.. రూరల్‌ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు ఇస్తామంటున్నారు.

Updated : 31 Jan 2023 08:16 IST

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: ‘వైకాపా అధిష్ఠానం కొత్త నాటకానికి తెరదీసింది. ప్రస్తుతం వైకాపా రాష్ట్ర సేవాదళ్‌ అధ్యక్షుడిగా ఉన్న గిరిధర్‌రెడ్డికి.. రూరల్‌ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు ఇస్తామంటున్నారు. నాకు పోటీగా.. నా తమ్ముడికి ఆఫరా.? ఫోన్‌ ట్యాపింగ్‌ వల్ల నా మనసు కలత చెందింది. కునుకు లేకుండా చేస్తోంది’ అని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అతని సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే మూడు నెలలుగా తన ఫోన్‌ను ట్యాపింగ్‌ చేస్తున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోటంరెడ్డి.. సోమవారం తన నియోజకవర్గంలోని అనుచరులతో మాట్లాడారు. కార్పొరేటర్లతో పాటు కొంతమంది సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫోన్‌ కాల్స్‌ను రహస్యంగా వింటున్నారని చెబుతూ.. దీనికి తగిన ఆధారాలను వారికి చూపించారు. మూడు తరాలుగా వైఎస్‌ కుటుంబానికి విధేయుడిగా ఉన్నానంటూ అనుమానం ఉన్నచోట కొనసాగడం కష్టమని వారికి స్పష్టం చేసినట్లు తెలిసింది. రాజకీయాలు తనకు కొత్తేమీ కాదని, ఎత్తుపల్లాలు ఎరిగిన వాడినన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోసమేనని, మీ నిర్ణయం ఏమిటో చెప్పాలని వారిని కోరినట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు