logo

సింహపురి ఎక్స్‌ప్రెస్‌కు ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల ఏర్పాటు

గూడూరు- సికింద్రాబాద్‌- సింహపురి ఎక్స్‌ప్రెస్‌ మార్చి 13వ తేదీ నుంచి గంటకు 130 కి.మీ. వేగంతో పయనించనుంది. రైల్వేశాఖ రైళ్ల వేగాన్ని ప్రస్తుతం ఉన్న 110 కి.మీ. నుంచి 130 కి.మీ. పెంచింది.

Updated : 01 Feb 2023 06:01 IST

నెల్లూరు(రైల్వేస్టేషన్‌) : గూడూరు- సికింద్రాబాద్‌- సింహపురి ఎక్స్‌ప్రెస్‌ మార్చి 13వ తేదీ నుంచి గంటకు 130 కి.మీ. వేగంతో పయనించనుంది. రైల్వేశాఖ రైళ్ల వేగాన్ని ప్రస్తుతం ఉన్న 110 కి.మీ. నుంచి 130 కి.మీ. పెంచింది. గత ఏడాది సెప్టెంబరు నాటికే ట్రాక్‌ను సైతం ఆ మేరకు పునరుద్ధరించింది. ఇప్పుడు ఆ వేగాన్ని అందుకునేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న కోచ్‌ల స్థానంలో ఎల్‌హెచ్‌బీ(లింక్‌ హాఫ్‌మ్మాన్‌ బుష్క)అనే కొత్త కోచ్‌లు అమర్చాలని నిర్ణయించారు. సికింద్రాబాద్‌- గూడూరు- సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు మార్చి 13 నుంచి ఈ ప్రత్యేక ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు అమర్చుతున్నట్లు విజయవాడ రైల్వే డివిజనల్‌ అధికారులు మంగళవారం తెలిపారు. 


రోజూ మెము రైళ్లు

బిట్రగుంట : విజయవాడ-బిట్రగుంట(07978), బిట్రగుంట-విజయవాడ(07977) మెము రైళ్లు బుధవారం నుంచి రోజూ ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని ఉన్నతాధికారుల నుంచి బిట్రగుంట ఎస్‌ఎస్‌ కార్యాలయానికి మంగళవారం సమాచారం అందింది. గతంలో ఎగువ మార్గంలో వెళ్లే 07978 విజయవాడ-బిట్రగుంట రైలు శుక్రవారం,  07977 బిట్రగుంట-విజయవాడ రైలు ఆదివారం లేకపోవడంతో వారానికి 6 రోజులు మాత్రమే రాకపోకలు సాగించేవి. బుధవారం నుంచి ప్రతిరోజూ నడుస్తాయని, ఈ రైళ్ల సేవలను ప్రయాణికులు ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని