logo

భార్య హత్య కేసులో జీవిత ఖైదు

భార్య ఒంటిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి ఆమె మృతికి కారకుడైన కేసులో నేరం రుజువు కావడంతో తడ మండలంలోని తడ కండ్రిగకు చెందిన సైమన్‌ గ్లోరీదా వినోద్‌కుమార్‌ అలియాస్‌ మహమ్మద్‌ అహ్మద్‌కు జీవిత ఖైదుతోపాటు, రూ.5 వేలు జరిమానా విధిస్తూ 8వ ఆదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి సి.సుమ మంగళవారం తీర్పు చెప్పారు.

Updated : 01 Feb 2023 05:56 IST

నెల్లూరు (లీగల్‌), న్యూస్‌టుడే: భార్య ఒంటిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి ఆమె మృతికి కారకుడైన కేసులో నేరం రుజువు కావడంతో తడ మండలంలోని తడ కండ్రిగకు చెందిన సైమన్‌ గ్లోరీదా వినోద్‌కుమార్‌ అలియాస్‌ మహమ్మద్‌ అహ్మద్‌కు జీవిత ఖైదుతోపాటు, రూ.5 వేలు జరిమానా విధిస్తూ 8వ ఆదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి సి.సుమ మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రం వేలూరు ప్రాంతానికి చెందిన ఎస్‌.వినోద్‌కుమార్‌ తమిళనాడులోని రంగాపురం గ్రామానికి చెందిన అన్సర్‌ఆఫ్రీన్నీసాను ప్రేమించి పెద్దల సమక్షంలో 2012 అక్టోబరు14 న వివాహం చేసుకున్నాడు. అనంతరం తడ సమీపంలోని శ్రీసిటీలో ఉద్యోగం వచ్చింది. దీంతో భార్యాభర్తలు తడకండ్రిగలో బాడుగ ఇంట్లో కాపురం ఉండేవారు. కట్నం రాలేదని తరచూ భార్యను వేధించే వాడు. ఈ క్రమంలో 2013 జూన్‌ 29వ తేదీ రాత్రి  భార్య  ఒంటిపై కిరోసిన్‌ పోసి అగ్గి పుల్లతో అంటించాడు. ఆమె కేకలు వేయగా చుట్టుపక్కల వారు రావడంతో నిందితుడు మంటలు ఆపే ప్రయత్నం చేశాడు. చికిత్స నిమిత్తం చెన్నై ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 4-7 2013 జులై నాలుగో తేదీ మృతి చెందింది. తడ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎస్‌.ప్రసాద్‌ కేసు వాదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని