logo

175 కాదు.. అయిదే మిగులుతాయ్‌ అబ్దుల్‌ అజీజ్‌

రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలవాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెబుతున్నారని, ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఐదే మిగిలేలా ఉన్నాయని నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ ప్రకటించారు.

Published : 01 Feb 2023 01:52 IST

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలవాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెబుతున్నారని, ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఐదే మిగిలేలా ఉన్నాయని నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ ప్రకటించారు. నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వైకాపా ఆవిర్భావం నుంచి ఆపార్టీతో నడిచిన నాయకులు ఇప్పుడు విభేదిస్తున్నారన్నారు. జిల్లాలో  రెండు మూడు నెలలుగా జిల్లాలో ఇద్దరు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. వారే కాదని మరో నలుగురు కూడా మాకు దరఖాస్తు పెట్టుకున్నారన్నారు.జిల్లా ఎస్పీ చేసిన పాపాల నుంచి ఆయన్ను ఎవరూ కాపాడలేరన్నారు. ధర్నాలు చేస్తే కేసులు పెట్టడానికి మాత్రమే పనికొస్తారని ఆరోపించారు.  నాయకులు చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, జెన్ని రమణయ్య, జలదంకి సుధాకర్‌ పాల్గొన్నారు.  

ఆ మాటలు సరికాదు: పోలీసు సంఘం

నెల్లూరు (నేర విభాగం): పోలీసు వ్యవస్థను కించపరిచేలా మాజీ మేయరు అబ్దుల్‌ అజీజ్‌ మాట్లాడటం తగదని పోలీసు అధికారుల సంఘం నాయకులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌ హాలులో పోలీసు అధికారుల సంఘం నాయకులు మద్దిపాటి ప్రసాద్‌ రావు, వై.శ్రీహరి, మౌలుద్దీన్‌ తదితరులు మాట్లాడారు.  చట్టానికి లోబడి విధులు నిర్వర్తించే పోలీసు అధికారులు, సిబ్బందిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మాజీ మేయరు అబ్దుల్‌ అజీజ్‌ పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు. సమావేశంలో నాయకులు పౌల్‌రాజు, తురకా శ్రీనివాసులు, ఎంజీఆర్‌ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు 4న

నెల్లూరు (సంక్షేమం), ఉదయగిరి: జిల్లాలోని ఆత్మకూరు, కావలి, కందుకూరు రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాల్లో అంగన్‌వాడీ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి నాలుగో తేదీ ఇంటర్వ్యూలు జరుగుతాయని ఐసీడీఎస్‌ పీడీ సౌజన్య తెలిపారు. నెల్లూరు ఐసీడీఎస్‌ కార్యాలయంలో సీడీపీవోలతో మంగళవారం ఆమె వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికేట్లు తప్పని సరిగా తీసుకురావాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని