logo

Nellore: అల్లుడికి కలకాలం గుర్తుండిపోయేలా.. 108 రకాలతో పసందైన విందు

కొత్త అల్లుడా.. మజాకా! కలకాలం గుర్తుండేలా పసందైన విందు ఇచ్చారు అత్తింటివారు. తొలిసారిగా ఇంటికి వచ్చిన అల్లుడికి 108 రకాల వంటలు చేసి వడ్డించిన వైనం పొదలకూరు మండలం ఊచపల్లిలో చోటుచేసుకుంది.

Updated : 02 Feb 2023 13:51 IST

న్యూస్‌టుడే, పొదలకూరు: కొత్త అల్లుడా.. మజాకా! కలకాలం గుర్తుండేలా పసందైన విందు ఇచ్చారు అత్తింటివారు. తొలిసారిగా ఇంటికి వచ్చిన అల్లుడికి 108 రకాల వంటలు చేసి వడ్డించిన వైనం పొదలకూరు మండలం ఊచపల్లిలో చోటుచేసుకుంది. ఊసా శివకుమార్‌, శ్రీదేవమ్మ దంపతులు తమ కుమార్తె శ్రీవాణిని.. నెల్లూరులోని బీవీనగర్‌ చెందిన ఇమ్మడిశెట్టి శివకుమార్‌కు ఇచ్చి ఇటీవల వివాహం చేశారు. మామ శివకుమార్‌ కండలేరు పోలీసుస్టేషన్లో హోంగార్డు. ఇంటికి వచ్చిన అల్లుడికి ఘుమఘుమలాడే 108 రకాల వంటలు తయారు చేయించి వడ్డించారు. ఇందులో చికెన్‌, మటన్‌, చేప, రొయ్యలు.. శాకాహారం, రసం, సాంబారు, పెరుగు, వివిధ రకాల పిండివంటలు, మిఠాయిలున్నాయి. ఈ వినూత్న ఆచారం చుట్టుపక్కల గ్రామాల్లో చర్చనీయాంశమైంది.     


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని