logo

పోలీసు శాఖలో భారీగా బదిలీలు

జిల్లా పోలీసుశాఖలో భారీగా మార్పులు చేర్పులు జరిగాయి. ఒకేసారి 11 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ విజయరావు ఆదేశాలు జారీ చేశారు.

Published : 05 Feb 2023 01:19 IST

ఒకేసారి 11 మంది ఎస్సైలకు..  ట్రాఫిక్‌లో ఏకంగా 28 మందికి..
జిల్లా పోలీసు శాఖ కార్యాలయం

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: జిల్లా పోలీసుశాఖలో భారీగా మార్పులు చేర్పులు జరిగాయి. ఒకేసారి 11 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ విజయరావు ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటు నాలుగేళ్లుగా ఒకే ప్రాంతంలో ఉన్న సిబ్బందికి సైతం స్థాన చలనం చేశారు.  ఇటీవల కాలంలో ఇద్దరు ఎస్సైలను సస్పెండ్‌ చేసిన జిల్లా పోలీసు బాస్‌- తాజాగా భారీగా ఎస్సైలను బదిలీ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నెల్లూరు సౌత్‌, నార్త్‌ విభాగాల్లో ఏకంగా 28 మంది సిబ్బందిని బదిలీ చేశారు. ట్రాఫిక్‌లో పని చేస్తున్న కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్లను నగరంలోని చిన్నబజారు, నవాబుపేట, సంతపేట, దర్గామిట్ట, వేదాయపాళెం పోలీసు స్టేషన్లకు బదిలీ చేశారు. ఆయా స్టేషన్లలో పనిచేసే వారిని ఇక్కడ నియమించాల్సి ఉంది.

స్థానచలనం పొందిన వారు..

విడవలూరులో పనిచేస్తున్న ఎస్‌.ఆనంద్‌ భాస్కర్‌బాబును దిశ పీఎస్‌కు, నెల్లూరు వీఆర్‌లో ఉన్న ఎం.ఆంజనేయులును విడవలూరు పీఎస్‌కు, ఎస్‌బీలోని పి.నాగ శిరీషను దిశ పీఎస్‌కు, దిశ పీఎస్‌లోని శివ సౌమ్యను నెల్లూరు వీఆర్‌కు బదిలీ చేశారు. సైదాపురం పీఎస్‌లోని ఎం.ఉమాశంకర్‌ను నెల్లూరు వీఆర్‌కు, నెల్లూరు వీఆర్‌లో ఉన్న కె.లేఖ ప్రియాంకను కావలి ఒకటో పట్టణ పీఎస్‌కు, కావలి ఒకటో పట్టణ పీఎస్‌లోని బి.మహేంద్రను కలువాయి పీఎస్‌కు,  అక్కడ ఉన్న ఎన్‌.ప్రభాకర్‌ను నెల్లూరు వీఆర్‌కు, నెల్లూరు వీఆర్‌లో ఉన్న కె.వేణుగోపాల్‌ను సంతపేట పీఎస్‌కు, నెల్లూరు వీఆర్‌లో ఉన్న ఎం.రాజ్‌కుమార్‌ను వేదాయపాళెం పీఎస్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారు వెంటనే ఆయా స్థానాల్లో చేరాలని ఎస్పీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని