logo

సంగంలో ఆభరణాల చోరీ

మండలంలోని జెండాదిబ్బ గ్రామంలో తాళం వేసిన ఇంటి నుంచి రూ.నాలుగు లక్షల విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 05 Feb 2023 01:19 IST

బీరువాను పరిశీలిస్తున్న పోలీసు అధికారులు

జండాదిబ్బ (సంగం), న్యూస్‌టుడే: మండలంలోని జెండాదిబ్బ గ్రామంలో తాళం వేసిన ఇంటి నుంచి రూ.నాలుగు లక్షల విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ గ్రామానికి చెందిన షణ్ముఖం కుటుంబసభ్యులతో కలసి గత నెలాఖరులో వేరే ఊరికి వెళ్లారు. శుక్రవారం తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులకొట్టి ఉన్నాయి. లోపలకు వెళ్లి చూడగా బీరువాతో పాటు, ఇతర అల్మరాలు తెరిచి ఉన్నట్లు గుర్తించారు. ఇల్లంతా చెల్లా చెదురుగా ఉండడంతో పరిశీలించగా ఏడు సవర్ల బంగారు ఆభరణాలు, దేవుడి హుండీలోని రూ.పది వేల నగదు కనిపించలేదు.  పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం రాత్రి సంగం సి.ఐ .రవినాయక్‌,  ఎస్సై కె.నాగార్జునరెడ్డి, క్లూస్‌టీంతో కలసి వేలి ముద్రలు సేకరించారు. ఈసంఘటన ఆ గ్రామంలో సంచలనం సృష్టించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని